IPL 2023 Auction Record : ఐపీఎల్ మినీ వేలం భారీ మూల్యం

10 జ‌ట్లు 80 మంది ఆట‌గాళ్లు రూ. 167 కోట్లు

IPL 2023 Auction Record : ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ వేలం కేర‌ళ లోని కొచ్చిలో ముగిసింది. కానీ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఉత్కంఠ భ‌రితంగా సాగింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. ఆయా జ‌ట్ల యాజ‌మాన్యాలు, హెడ్ కోచ్ లు, కెప్టెన్లు ఎక్కువ‌గా త‌మ జ‌ట్ల‌కు స‌రిపోయే ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసుకోవ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఐపీఎల్ చ‌రిత్ర లోనే అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయాడు సామ్ క‌ర‌న్. ఒక ర‌కంగా ఇది రికార్డు.

ఆ త‌ర్వాతి స్థానం కామెరూన్ కు ద‌క్కింది. ఈ ఆసిస్ స్టార్ ను ముంబై ఇండియ‌న్స్ స్వంతం చేసుకుంది. 87 స్లాట్స్ కోసం ఆయా జ‌ట్లు ఫోక‌స్ పెట్టాయి. గ‌తంలో స్టార్ డ‌మ్ సాధించిన ప్లేయ‌ర్లు ఈసారి జ‌రిగిన మినీ వేలంలో ఆక‌ట్టుకోలేక పోవ‌డం విస్తు పోయేలా చేసింది. చాలా మంది స్టార్ల‌ను ప‌ట్టించుకోలేదు ఫ్రాంచైజీలు.

విచిత్రం ఏమిటంటే ఈసారి ఇంగ్లీష్ ఆట‌గాళ్లు దుమ్ము రేపారు. తాము కూడా ఊహించ‌ని రీతిలో వేలం పాట‌లో అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయారు. ఇటీవ‌ల ఇంగ్లండ్ జ‌ట్టు అన్ని ఫార్మాట్ ల‌లో దుమ్ము రేపుతోంది. క్యాప్, అన్ క్యాప్ ప్లేయ‌ర్ల‌లో చాలా మందిపై ఫోక‌స్ పెట్టినా కొంద‌రికే ఛాన్స్ ద‌క్కింది. ఈ మినీ ఆక్ష‌న్ లో న‌లుగురు ప్లేయ‌ర్లు ఏకంగా రూ. 15 కోట్ల‌కు అమ్ముడు పోయి చ‌రిత్ర(IPL 2023 Auction Record) సృష్టించారు.

మొత్తం 10 ఫ్రాంచైజీలు దాదాపు రూ. 167 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేశాయి. ఈ వేలం పాట‌లో మొత్తం 51 మంది భార‌త ప్లేయ‌ర్ల‌ను కొనుగోలు చేయ‌డం విశేషం. పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ హాట్ టాపిక్ గా మారింది. ఆ మేనేజ్మెంట్ సామ్ క‌ర‌న్ ను రూ. 18.5 కోట్ల‌ ధ‌ర‌కు కొనుగోలు చేసింది. ఇక ఆసిస్ స్టార్ ఆల్ రౌండ‌ర్ కామెరాన్ గ్రీన్ కోసం ప‌లు జ‌ట్లు పోటీ ప‌డ్డాయి. కానీ చివ‌ర‌కు ముంబై చేజిక్కించుకుంది. రూ. 17.5 కోట్లు వెచ్చించింది. బెన్ స్టోక్స్ ను రూ. 16. 5 కోట్ల‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ ద‌క్కించుకుంది.

అదృష్టం అంటే హ్యారీ బ్రూక్ దేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అత‌డి కోసం రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పోటీ ప‌డ్డాయి. కానీ చివ‌ర‌కు కావ్య మార‌న్ సిఇఓగా ఉన్న స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కైవ‌సం చేసుకుంది. రూ. 13.25 కోట్ల‌కు తీసుకుంది. మ‌యాంక అగ‌ర్వాల్ ను కూడా రూ. 8.25 కోట్ల‌కు చేజిక్కించుకుంది. ఇక నికోల‌స్ పూరన్ ను రూ. 16 కోట్ల‌కు తీసుకుంది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ . మ‌రో వైపు జేస‌న్ హోల్డ‌ర్ ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రూ. 5.75 కోట్ల‌కు చేజిక్కించుకుంది.

Also Read : ఆ ఆట‌గాళ్లు అమ్ముడు పోలేదు

Leave A Reply

Your Email Id will not be published!