IPL 2022 : ఎండా కాలంలో ఐపీఎల్ పండగ‌

ఐపీఎల్ మెగా లీగ్ మార్చి లోనేనా

IPL 2022 : ప్ర‌పంచంలో ఏ క్రీడా సంస్థ‌కు లేనంత‌టి క్రేజ్ ఒక్క భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐకి ఉంది. ఇప్ప‌టికే దాని ఆదాయం వేల కోట్ల‌ను దాటేసింది. ఎప్పుడో జ‌గ‌న్మోహ‌న్ దాల్మియా పుణ్య‌మా అని క్రికెట్ కు ఒక వ్యాపార‌మైన క‌ళ‌ను తీసుకు వ‌చ్చాడు.

ఆయ‌న వేసిన బీజం ఇంతింతై వ‌టుడింతై అన్న‌ట్టుగా కొన‌సాగుతూనే ఉంది. కోట్ల‌ను కురిపిస్తోంది. ఇటీవ‌ల రెండు కొత్త జ‌ట్ల కోసం ఐపీఎల్(IPL 2022) లో ఆడేందుకు బిడ్ ఆహ్వానిస్తే ఏకంగా బీసీసీఐకి రూ. 1,725 కోట్లు వ‌చ్చాయంటే న‌మ్మ‌గ‌ల‌మా. న‌మ్మాల్సిందే.

అందుకే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తన త‌న‌యుడిని మెల్ల‌గా బీసీసీఐలోకి ఎంట‌ర్ అయ్యేలా చేశాడు. ఇప్పుడు బీసీసీఐకి చీఫ్ గంగూలీ ఉన్న‌ప్ప‌టికీ చ‌క్రం తిప్పుతున్న‌దంతా గుజ‌రాత్ కు చెందిన జే షానే.

క్రికెట్ ఒక్క‌టే కాదు కోట్లాది రూపాయ‌లు క‌లిగిన భార‌తీయ స‌హ‌కార సంస్థ కూడా షా చేతుల్లోకి వెళ్లింది. ప్ర‌తి ఏటా ఐపీఎల్(IPL 2022) కోసం మెగా వేలాన్ని నిర్వ‌హించ‌డం ప‌రిపాటి.

ఈసారి కూడా బెంగ‌ళూరు వేదిక‌గా రెండు రోజుల పాటు వేలం నిర్వ‌హించారు. మొత్తం 590 మందిని బీసీసీఐ సెలెక్టు చేస్తే 204 మందిని మాత్ర‌మే తీసుకున్నాయి ఫ్రాంచైజీలు. మిగ‌తా వాళ్లను ప‌క్క‌న పెట్టేశాయి.

ఇక ఐపీఎల్ ను ఇండియాలోనే నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసింది బీసీసీఐ. ఇప్ప‌టి వ‌ర‌కు స్పాన్స‌ర్ గా ఉన్న చైనాకు చెందిన వివో కంపెనీ నుంచి టాటా స‌న్స్ తీసుకుంది.

ఈ ర‌కంగా కూడా బీసీసీఐకి ఆదాయం స‌మ‌కూరింది. అయితే ఐపీఎల్ రిచ్ లీగ్ ను మార్చి నెల‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు టాక్. ఎండా కాలంలో క్రికెట్ పండ‌గ ఉండ‌నుంద‌న్న మాట‌.

Also Read : శ్రీ‌లంకతో సీరీస్ కు భార‌త జ‌ట్టు డిక్లేర్

Leave A Reply

Your Email Id will not be published!