IPL Media Rights : ప్రపంచ క్రీడా రంగంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐకి ఓ ప్రత్యేకత ఉంది. ఆసియా లోనే కాదు వరల్డ్ వైడ్ గా అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా ఎదుగుతోంది.
ఒకానొక సమయంలో భారత ప్రభుత్వం బీసీసీఐ (BCCI) పై ఆధారపడే స్థాయికి చేరుకున్న సందర్భం కూడా నెలకొందంటే నమ్మగలమా.
తాజాగా బీసీసీఐ (BCCI) నిర్వహిస్తున్న ఇండియన్ ప్రిమీయర్ రిచ్ లీగ్ తోనే బీసీసీఐకి (IPL Media Rights) లెక్కించలేని కోట్లల్లో ఆదాయం సమకూరుతోంది.
ఇక ఇప్పటికే మీడియా హక్కుల కోసం (IPL Media Rights) విపరీతమైన పోటీ నెలకొంది.
ప్రపంచ వ్యాప్తంగా రిలయన్స్ , సోనీ, జీ గ్రూప్, స్టార్ గ్రూప్స్ సంస్థలు పోటీ పడుతుండడం విశేషం.
తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది బీసీసీఐ (BCCI). ఐపీఎల్ (IPL) మీడియా హక్కుల (IPL Media Rights) కోసం టెండర్ వేసింది.
ఇందులో భాగంగా 2023-2027 సీజన్ల కోసం ఈ టెండర్ ఆహ్వనిస్తున్నట్లు బీసీసీఐ (BCCI) ఎట్టకేలకు ప్రకటించింది.
ఐపీఎల్ మీడియా హక్కుల (IPL Media Rights) ఈ వేలం జూన్ 12న ప్రారంభం అవుతుంది. రెండు కొత్త జట్లు, మరిన్ని మ్యాచ్ లు , కొత్త వేదికలు, టాటా సపోర్ట్ తో ప్రారంభమైంది.
ఈ మేరకు టెండర్ ఆహ్వానించడం ఆనందంగా ఉందని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ (Saurav Ganguly) , సెక్రటరీ జే షా తెలిపారు.
ఈ టెండర్ ద్వారా ఆదాయాన్ని పెంచడమే కాదు విలువ కూడా పెరుగుతుందన్నారు.
బీసీసీఐ మీడియా హక్కుల టెండర్ ను ఐదు ప్యాకేజీలుగా విభజించనుంది. వీటిలో ఎ-ప్యాకేజీ కింద గ్లోబల్ రైట్స్ టెలివిజన్ ను చేర్చింది.
బి – ప్యాకేజీ కింద గ్లోబల్ డిజిటల్ రై్ట్స్ ను, సీ – ప్యాకేజీ కింద ప్రపంచ ప్రసార హక్కులు,
డి – ప్యాకేజీ కింద టెలివిజన్ హక్కులు ఉపఖండం (ఆసియా ) , ఇ – ప్యాకేజీ కింద డిజిటల్ హక్కులు – ఆసియా కోసం టెండర్ ఆహ్వానించింది.
ఇక అర్హత అవసరాలు, బిడ్ ల సమర్పణల ప్రక్రియ, ప్రతిపాదిత మీడియా హక్కుల ప్యాకేజీలు, బాధ్యతలు మొదలైన వాటితో సహా ఐటీటీలో పొందు పర్చారు.
రూ.25 లక్షల నాన్ రిఫండబుల్ రుసుముతో పాటు , సేవల పన్ను చెల్లించాకే టెండర్ లో పాల్గొనాల్సి ఉంది. ఈ టెండర్ ప్రక్రియ 2022 మే 10 దాకా(IPL Media Rights) అందుబాటులో ఉంటుంది.
ప్రస్తుతం డిస్నీ స్టార్, జీ సోని, రిలయన్స్ మద్దతు గల వయా కామ్ 18 , అమెజాన్ లు ఐపీఎల్ మీడియా హక్కుల కోసం కీలక బిడ్డర్లుగా భావిస్తున్నారు.
అంతే కాదు అమెరికన్ టెక్ కంపెనీలు , గ్లోబల్ బిజినెస్ కన్సార్టియంలు కూడా పోటీలో ఉండనున్నాయి. దీంతో బీసీసీఐకి రూ. 50 వేల కోట్లకు పైగానే అందనున్నాయి.
Also Read : యజ్వేంద్ర చహల్ అరుదైన ఘనత