IPL Prize Money : ఐపీఎల్ టైటిల్ గెలిస్తే రూ. 20 కోట్లు

ర‌న్న‌ర‌ప్ కు భారీగానే ప్రైజ్ మ‌నీ

IPL Prize Money : ముంబై వేదిక‌గా జ‌రిగే ఐపీఎల్ -2022 రిచ్ లీగ్ టైటిల్ గెలిచిన జ‌ట్టుకు ఏకంగా రూ. 20 కోట్ల ప్రైజ్ మ‌నీ ద‌క్కుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ టోర్నీపై అత్యంత ఆస‌క్తి నెల‌కొని ఉంటుంది.

గ‌తంలో ఎన్నో జ‌ట్లు మారినా ఈసారి అనూహ్యంగా రెండు కొత్త జ‌ట్లు ముందుకు వ‌చ్చాయి.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన 14వ సీజ‌న్ల‌లో 8 జ‌ట్లు పాల్గొంటే ఈసారి 10 జ‌ట్లు పాల్గొన‌నున్నాయి.

కొత్త‌గా ల‌క్నో జెయింట్స్ , గుజరాత్ టైటాన్స్ చేరాయి. ఈ రెండు జ‌ట్ల ద్వారానే బీసీసీఐకి ఏకంగా రూ. 1725 కోట్లు వ‌చ్చి చేరాయి. ఇక టెలికాస్ట్ , ఇత‌ర మార్గాల ద్వారా ఈ ఒక్క లీగ్ తోనే దాదాపు స‌ద‌రు సంస్థ‌కు భారీ ఎత్తున కోట్లు చేర‌నున్నాయి.

ఇప్పుడు కార్పొరేట్ సంస్థ‌ల చేతుల్లో జ‌ట్లు కొలువు తీరాయి. దేశ‌, విదేశాల‌కు చెందిన స్టార్ ప్లేయ‌ర్లు ఇందులో భాగ‌స్వామ్యుల‌వుతున్నారు.

ఇక క్రికెట్ ఫెస్టివ‌ల్ కోసం కోట్లాది మంది వేచి చూస్తున్నారు. ఫోర్లు, సిక్స‌ర్ల కోసం రెడీ అయ్యారు. ఐపీఎల్ దెబ్బ‌కు ప్ర‌ధాన రంగాలపై ఎక్కువ ప్ర‌భావం ప‌డ‌నుంది.

అందుకే ఐటీ, త‌దిత‌ర కార్పొరేట్ సంస్థ‌లు త‌మ సిబ్బందికి వీలుగా మ్యాచ్ లు చూసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఐపీఎల్ టోర్నీ(IPL Prize Money) రెండు నెల‌లు 60 రోజులు 75 మ్యాచ్ లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈసారి 25 శాతం మంది ప్రేక్ష‌కుల‌కే ప‌ర్మిష‌న్ ఇచ్చింది బీసీసీఐ. ముంబై లోని నాలుగు వేదిక‌ల‌ను ఎంపిక చేసింది. వాటిలోనే ఈ మ్యాచ్ లు జ‌రుగుతాయి. 10 టీం ల‌ను రెండు గ్రూపులుగా విభ‌జించారు.

ఈసారి ప‌లు జ‌ట్ల‌కు కొత్త కెప్టెన్లు కొలువు తీరారు. గ్రూప్ ల వారీగా చూస్తే -ఎ- గ్రూపులో ముంబై ఇండియ‌న్స్ , కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , ఢిల్లీ క్యాపిట‌ల్స్ , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఉన్నాయి.

ఇక గ్రూప్ – బి- లో చెన్నై సూప‌ర్ కింగ్స్ , స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ , రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ , గుజ‌రాత్ టైటాన్స్ ఉన్నాయి.

Also Read : ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రాణిస్తారా

Leave A Reply

Your Email Id will not be published!