Parastou Forouhar : మహిళలపై ఇరాన్ ఉక్కుపాదం
స్వేచ్ఛకు బతికేందుకు వ్యతిరేకం
Parastou Forouhar : ఇరాన్ అట్టుడుకుతోంది. మహిళల పట్ల అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు మరింత నిరసన వ్యక్తం చేసేలా చేస్తున్నాయి. దీనిపై బాధిత మహిళలు భగ్గుమంటున్నారు. హిజాబ్ విషయంపై ఓ యువతిని పోలీసులు హత్యకు పాల్పడడం ఇప్పుడు ఇరాన్ పై వ్యతిరేకతను ఎదుర్కొనేలా చేసింది.
దీనిపై ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఖండిస్తున్నారు. తాజాగా ఇరాన్ కు చెందిన కళాకారణి పరస్టౌ ఫోరౌహర్(Parastou Forouhar) కోపాన్ని వ్యక్తం చేశారు. 30 ఏళ్ల పాటు ప్రవాసం తర్వాత ఇప్పటికీ తన మాతృభూమిలో మహిళల హక్కుల కోసం డిమాండ్ చేస్తోంది. మహ్సా అమినీకి సెప్టెంబర్ 21తో 23 ఏళ్లు నిండాయి.
ఆమె హిజాబాద్ ధరించ లేదనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఇంత చిన్న నేరానికి ఆమె పోలీసు కస్టడీలో ఎలా చనిపోయిందంటూ ప్రశ్నిస్తోంది ఆర్టిస్ట్. ఇది హిజాబ్ ధరించేందుకు నిరాకరించడం గురించి కాదు. సరిగ్గా ధరించ లేదని ఆరోపించిన మహ్సా అమానీ గురించి మాత్రమే.
దాని కారణంగా ఆమె దారుణంగా ప్రవర్తించబడింది. భయంకరంగా దాడికి గురైంది. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయింది. ఆమెను చంపే అధికారం ఎవరిచ్చారంటూ కళాకారణి నిలదీసింది. ఇప్పుడు అక్కడ మహిళలు వీధుల్లోకి వస్తున్నారు. అనేక నిరసనలు చోటు చేసుకుంటున్నాయి.
ముసుగులు ధరించేందుకు ఒప్పు కోవడం లేదు. మహిళలు వాటిని తగుల బెడుతున్నారు. వాటిని బహిరంగంగానే చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కొందరు మహిళలపై కాల్పులు కూడా చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. మత నియంతృత్వానికి ఇది పరాకాష్ట. ఎవరైనా బతికేందుకు హక్కు ఉందన్నారు కళాకారిణి.
Also Read : ఆంగ్ సాన్ సూకీకి మళ్లీ జైలు శిక్ష