Lionel Messi : గాయం నిజమేనా మెస్సీ ఆడేనా
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ కు కష్టమేనా
Lionel Messi : ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ -2022 ఆఖరి అంకానికి చేరుకుంది. కేవలం అడుగు దూరంలో ఉంది. మొత్తం 32 జట్లు పాల్గొన్న ఈ మెగా టోర్నీలో చివరకు అర్జెంటీనా, ఫ్రాన్స్ ఫైనల్ కు చేరాయి. ఇక ఫ్రాన్స్ డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉంది. ఈ తరుణంలో ఇదే తన కెరీర్ లో ఆఖరు అంటూ సంచలన ప్రకటన చేశాడు ఫుట్ బాల్ దిగ్గజం అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టు స్కిప్పర్ లియోనెల్ మెస్సీ(Lionel Messi).
35 ఏళ్ల మెస్సీ తాను ఆట నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించి విస్తు పోయేలా చేశాడు. చివరి సారిగా ఆడే ఈ మెగా టోర్నీలో తన దేశానికి ప్రపంచ కప్ తీసుకు రావాలని డిసైడ్ అయ్యాడు. అయితే అనుకోని రీతిలో గాయమైనట్లు సమాచారం. ప్రాక్టీస్ కు కూడా అందుకే రాలేదని, ఫైనల్ మ్యాచ్ లో ఆడతాడో లేదోనని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
దీనిపై అర్జెంటీనా దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. తమ ఫుట్ బాల్ దేవుడు ఆడడం చూడలేమా అంటూ వాపోతున్నారు. మెస్సీ(Lionel Messi) ఫైనల్ లో ఆడేలా శక్తి ఇవ్వాలంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇదిలా ఉండగా జట్టు సారథిగా తనదైన ప్రతిభతో అర్జెంటీనాను ఫైనల్ కు చేర్చాడు.
వరల్డ్ కప్ ను ముద్దాడి ఘనంగా వీడ్కోలు తీసుకోవాలని అనుకున్నాడు మెస్సీ. మరి గాయం నిజమేనా ఆడడా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇక ఆదివారం జరిగే ఫైనల్ పోరులో ఎవరు ఆడతారో లేదోనని తేలుతుంది.
Also Read : కుల్దీప్ కమాల్ బంగ్లా ఢమాల్