IT Seized : ఐటీ దాడుల్లో 58 కోట్ల నగదు 38 కిలోల బంగారం
కళ్లు బైర్లు కమ్మేలా మరాఠా వ్యాపారి నిర్వాకం
IT Seized : ఆదాయ పన్ను శాఖ అధికారులు విస్తు పోయేలా భారీ ఎత్తున నగదు, బంగారం పట్టుబడింది. మహారాష్ట్రలోని ఓ వ్యాపారి ఇంట్లో సమాచారం మేరకు దాడులు చేపట్టింది ఐటీ శాఖ. కళ్లు బైర్లు కమ్మాయి ఐటీకి.
విచిత్రం ఏమిటంటే సదరు వ్యాపారి ఇంట్లో ఏకంగా రూ. 58 కోట్ల నగదు బయట పడింది. వీటితో పాటు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అతడికి చెందిన ఇళ్లు, ఆఫీసులపై దాడులు చేపట్టింది.
పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు గుట్టలుగా పేరుకు పోయాయి. ఇందుకు సంబంధించి నోట్ల కట్టలను లెక్కించేందుకు 13 గంటలకు పైగా సమయం పట్టింది.
జాల్నా, ఔరంగాబాద్ నగరాల్లో ఉక్కు, వస్త్ర, రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తూ వస్తున్నారు సదరు వ్యాపారి. నగదుతో పాటు 38 కేజీల బంగారం కూడా పట్టుకున్నారు(IT Seized).
సదరు వ్యాపారికి చెందిన రూ. 390 కోట్ల విలువ చేసే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు(IT Seized) ఐటీ అధికారులు. ఇదిలా ఉండగా పన్ను ఎగవేతకు పాల్పడిన వ్యాపారుస్తుల జాబితాను సిద్దం చేసింది ఐటీ శాఖ.
ఇందులో భాగంగా ఆగస్టు 1 నుంచి 8 వరకు జాల్నా, ఔరంగాబాద్ లోని వ్యాపారి ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. దాదాపు ఎనిమిది రోజుల పాటు ఈ దాడులు, సోదాలు కొనసాగాయి.
వామ్మో తలుచుకుంటేనే షాక్ కు లోనవుతాం. ఇందులో 260 మంది అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో ఇంత పెద్ద మొత్తంలో నగదుతో పాటు బంగారం పట్టుబడడం ఇదే మొదటిసారి.
కాగా సదరు వ్యాపారి విషయం వెల్లడించక పోవడం అనుమానం కలిగిస్తోంది.
Also Read : అలీబాబాలో 10,000 వేల మంది తొలగింపు