IT Raids : కాంగ్రెస్..బీఆర్ఎస్ నేతలకు ఐటీ షాక్
రంగంలోకి దిగిన ఆదాయ పన్ను శాఖ
IT Raids : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికల వేళ దాడులు , సోదాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలతో హోరెత్తిస్తున్నారు. మరో వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కొరఢా ఝులిపిస్తోంది.
ఓ వైపు ఓటర్లను చైతన్యవంతం చేస్తూనే ఇంకో వైపు ఆరోపణలు, విమర్శలు వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకుంటోంది. ఈ మేరకు ఈసీ ఈసారి నజర్ పెట్టింది. తమ వెబ్ సైట్ లో ఎవరైనా సరే అనుమానం వచ్చినా లేదా ఫిర్యాదు చేయాలన్నా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఈసీ కోరింది.
IT Raids in Telangana
ఇప్పటికే రాష్ట్రంలో భారీ ఎత్తున డబ్బులు , మద్యం పంపిణీ చేసేందుకు అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్, బీజేపీ ఆరోపించింది. మరో వైపు ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్(Congress), బీజేపీలు ప్రయత్నాలు చేస్తున్నాయంటూ బీఆర్ఎస్ అంటోంది.
దీంతో ఇరు పార్టీలకు చెందిన నేతలపై ఆదాయ పన్ను శాఖ ఫోకస్ పెట్టింది. గురువారం హైదరాబాద్ లో కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకుల ఇళ్లపై సోదాలు చేపట్టింది. మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బరిలో నిలిచిన కేఎల్ఆర్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.
ఇదే సమయంలో ఇదే నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ ఆశించిన పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లో కూడా ఐటీ దాడులు చేసింది. ఇక వినాయక చవితి వేలం పాటలో బాలాపూర్ లడ్డూను వేలం పాటలో దక్కించుకున్న బీఆర్ఎస్ నేత లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా ఐటీ రంగంలోకి దిగింది.
బాలాపూర్ లడ్డు వేలంలో దక్కించుకున్న బీఆర్ఎస్ నాయకుడు వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో సోదాలు.
Also Read : Eatala Rajender : నా లక్ష్యం కేసీఆర్ పతనం