IT Raids : హైదరాబాద్ – మొన్నటి దాకా బీఆర్ఎస్ లో ఉండి ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. నిన్ననే పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను టార్గెట్ చేయాలని బీఆర్ఎస్ చూస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
IT Raids on Ponguleti’s House
ఎందుకంటే తాను సీఎం కేసీఆర్ ను, కేటీఆర్ ను, ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. దీంతో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనంటూ మండిపడ్డారు. తనపై ఎన్ని దాడులకు దిగినా బయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
ఈ తరుణంలో గురువారం తెల్ల వారు జాము నుంచే కేంద్ర ఆధీనంలోని ఐటీ ఆధ్వర్యంలో విస్తృతంగా దాడులు మొదలయ్యాయి. ఇంకా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) నివాసంతో పాటు రాఘవ కన్ స్ట్రక్షన్స్ కు సంబంధించిన కార్యాలయాలలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
మరో వైపు ఇవాళ మంచి రోజు , ముహూర్తం కావడంతో నామినేషన్ వేసేందుకు రెడీ అయ్యారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మంతో పాటు ఇతర ప్రాంతాలలో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
Also Read : Revanth Reddy : హైదరాబాద్ లో అమరావతి సిటీ