IT Raids Sukumar : ఐటీ తగ్గేదే లే..సుకుమార్ కు షాక్
మైత్రీ మూవీ మేకర్స్ పై దాడులు
IT Raids Sukumar : పుష్ప రాజ్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన సుకుమార్ కు(IT Raids Sukumar) కోలుకోలేని షాక్ తగిలింది. ఆదాయ పన్ను శాఖ మెరుపు దాడులు చేపట్టింది. దర్శకుడితో పాటు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఆఫీసులోనూ కూడా జల్లెడ పడుతోంది. ఇప్పటికే పుష్ప ద్వారా దేశ వ్యాప్తంగా పేరు పొందారు సుకుమార్. భారీ ఎత్తున వసూళ్లు సాధించింది ఈ చిత్రం. తగ్గేదేలే అన్న డైలాగ్ తో ఊ అంటావా అన్న పాటతో దేశాన్ని ఉర్రూత లూగించేలా చేసింది. ఈ ఒక్క మూవీ సుకుమార్ కు ఊహించని రీతిలో పేరు వచ్చింది.
దీంతో పుష్ప ఇచ్చిన జోష్ తో పుష్ప-2 కూడా పూర్తయింది. ఇటీవలే ట్రైలర్ కూడా విడుదలైంది. దానికి భారీ ఎత్తున ఆదరణ లభించింది. ఇక హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోని యెర్నేని నవీన్ , యలమంచలి రవిశంకర్ లతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ , ప్రమోటర్ల ఆఫీసులను ఐటీ జల్లెడ పడుతున్నట్లు సమాచారం. జీఎస్టీ రూల్స్ పాటించ లేదని, ఐటీ దాఖలులో తప్పుడు వివరాలు నమోదు చేసినట్లు తేలడంతో వెంటనే ఐటీ రంగంలోకి దిగింది.
మరో వైపు పుష్ప -2 మూవీ కోసం సుకుమార్(Sukumar) ఏకంగా భారీ ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్. తాను తీసిన పుష్ప మూవీ డైలాగ్ నే రిపీట్ చేస్తూ ఐటీ కూడా జోరు పెంచింది. తాము కూడా తగ్గేదే లే అంటూ ఝలక్ ఇవ్వడం విశేషం.
Also Read : నిరాశకు లోనైన కావ్య మారన్