J. P. Nadda: బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా భార్య కారు చోరీ !

బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా భార్య కారు చోరీ !

J. P. Nadda: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య ఎస్‌యూవీ కారు చోరీకి గురయ్యింది. ఢిల్లీలోని గోవింద్ పురి ప్రాంతంలో ఉన్న సర్వీసింగ్ సెంటర్‌ నుంచి కారు దొంగతనం జరిగింది. కారును సర్వీసింగ్‌కు ఇచ్చి డ్రైవర్ తినడానికి వెళ్లారు. తిరిగి వచ్చి చూడగా సర్వీస్ సెంటర్‌లో కారు కనిపించలేదు. దీనితో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా కారు గురుగ్రామ్ వైపు వెళ్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షులు కారు కూడా దొంగతనానికి గురికావడంపట్ల నెటిజట్లు సెటైర్లు వేస్తున్నారు.

J. P. Nadda Wife’s Car Theft..

జేపీ నడ్డా భార్య కారు ఈ నెల 19వ తేదీన చోరీకి గురయ్యింది. తెల్లని రంగు ఫార్చూనర్ కారు దొంగతనానికి గురయ్యిందని ఫిర్యాదులో డ్రైవర్ జోగిందర్ పేర్కొన్నారు. కారు హిమాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉంది. కారు నంబర్ హెచ్‌పీ 03 డీ 0021 అని ఫిర్యాదులో డ్రైవర్ వెల్లడించారు. దీనితో కారు ఎక్కడ ఉందో కనుగొనేందుకు పోలీసులు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

Also Read : Janasena : ఈ నెల 30న పిఠాపురం నుంచి జనసేన స్థానాల వరకు జనసేనాని ప్రచారం మొదలు..

Leave A Reply

Your Email Id will not be published!