Kangana Ranaut: కాంగ్రెస్‌ నేత అభ్యంతరకర పోస్ట్‌ కు కంగన స్ట్రాంగ్ రిప్లై !

కాంగ్రెస్‌ నేత అభ్యంతరకర పోస్ట్‌ కు కంగన స్ట్రాంగ్ రిప్లై !

Kangana Ranaut: లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న సినీ నటి కంగనా రనౌత్‌(Kangana Ranaut) కు సంబంధించిన ఓ అభ్యంతరకర పోస్ట్‌ నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. కంగనా రనౌత్ ను కించపరుస్తూ కాంగ్రెస్‌ మహిళానేత సుప్రియ ఇన్‌స్టాగ్రామ్‌ అధికారిక ఖాతాలో ఈ పోస్ట్ కనిపించింది. దీనితో కాంగ్రెస్ మహిళా నేత సుప్రియపై బీజేపీ వర్గాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమెను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశాయి. మరోవైపు ఈ పోస్ట్ పై కంగన స్పందిస్తూ… ప్రతీ మహిళ తన గౌరవానికి అర్హురాలని పేర్కొన్నారు. ప్రస్తుతం కంగనా రనౌత్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో పాటు కాంగ్రెస్ లో తీవ్ర చర్చకు దారితీస్తుంది.

Kangana Ranaut Slams

కాంగ్రెస్ మహిళా నేత సుప్రియ చేసిన పోస్ట్ కు స్పందిస్తూ… ‘‘క్వీన్‌లో అమాయక పాత్ర నుంచి తలైవిలో శక్తిమంతమైన మహిళా నేత వరకు.. మణికర్ణికలో దేవత పాత్ర నుంచి చంద్రముఖిలో దెయ్యం పాత్ర వరకు.. 20 ఏళ్ల నా సినీ కెరీర్‌లో ఇలా అనేక రకాల పాత్రల్లో నటించాను. మహిళలను దురాభిమానపు సంకెళ్ల నుంచి కాపాడుకోవాలి. సెక్స్‌ వర్కర్ల దుర్భర జీవితాలను ప్రస్తావిస్తూ ఇతరులను దూషించడం మానుకోవాలి. ప్రతి మహిళ తన గౌరవానికి అర్హురాలు’’ అని కంగనా రనౌత్‌ పేర్కొన్నారు.

అయితే… తన అధికారిక ఇన్ స్టా గ్రామ్ లో ఆ పోస్టు తాను చేసింది కాదని సుప్రియా తెలిపారు. ‘‘నా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల యాక్సెస్‌ చాలామంది వద్ద ఉంది. వారిలో ఒకరు ఈ అభ్యంతరకర పోస్ట్‌ పెట్టారు. నా దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని తొలగించాను. నేను ఏ మహిళ గురించి కూడా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయను. ఆ విషయం నాతో పరిచయం ఉన్న అందరికీ తెలుసు. నా పేరుతో సృష్టించిన నకిలీ ఖాతాలో ఉన్న సంబంధిత పోస్టును ఇక్కడా వేశారు. ఆ పని ఎవరో చేశారో తేల్చే పనిలో ఉన్నాను. నకిలీ ఖాతాపైనా ‘ఎక్స్‌’లో ఫిర్యాదు చేశాను’’ అని వివరణ ఇచ్చారు.

Also Read : J. P. Nadda: బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా భార్య కారు చోరీ !

Leave A Reply

Your Email Id will not be published!