BRS MP List: హైదరాబాద్‌ లోక్‌ సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ !

హైదరాబాద్‌ లోక్‌ సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ !

BRS MP List: పెండింగులో ఉన్న హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్ అధిష్టానం. హైదరాబాద్ లోక్ సభ స్థానం నుండి గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ ను బరిలోకి దించనున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ వెల్లడించారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే పలు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ… హైదరాబాద్‌ స్థానాన్ని మాత్రం పెండింగులో ఉంచింది. సోమవారం శ్రీనివాస్‌ యాదవ్‌ను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో తెలంగాణాలో ఉన్న 17 లోక్ సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్ధుల ప్రకటన పూర్తయినట్లయింది.

BRS MP List – 17 లోక్ సభ స్థానాల బీఆర్ఎస్ అభ్యర్థులు వీళ్లే !

సికింద్రాబాద్‌ – పద్మారావుగౌడ్‌
కరీంనగర్‌ – వినోద్‌కుమార్‌
పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్‌
ఖమ్మం – నామా నాగేశ్వరరావు
మహబూబాబాద్‌ – మాలోత్‌ కవిత
చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్
వరంగల్‌ – డాక్టర్ కడియం కావ్య
జహీరాబాద్‌ – అనిల్‌కుమార్‌
నిజామాబాద్‌ – బాజిరెడ్డి గోవర్ధన్‌
నాగర్‌కర్నూల్‌ – ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
మెదక్‌ – వెంకట్రామిరెడ్డి
మహబూబ్‌నగర్‌ – మన్నె శ్రీనివాస్‌రెడ్డి
మల్కాజిగిరి – రాగిడి లక్ష్మారెడ్డి
ఆదిలాబాద్‌ – ఆత్రం సక్కు
భువనగిరి- క్యామ మల్లేశ్‌
నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి
హైదరాబాద్‌- గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌

Also Read : Kangana Ranaut: కాంగ్రెస్‌ నేత అభ్యంతరకర పోస్ట్‌ కు కంగన స్ట్రాంగ్ రిప్లై !

Leave A Reply

Your Email Id will not be published!