Jacqueline Fernandez : జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు బెయిల్

రూ. 200 కోట్ల కుంభ‌కోణం కేసులో న‌టికి ఊర‌ట

Jacqueline Fernandez :  దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన రూ.200 కోట్ల కుంభ‌కోణం కేసులో బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఊర‌ట ల‌భించింది. ఇప్ప‌టికే ఆమెపై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ విచార‌ణ చేప‌ట్టింది. ఈ మ‌నీలాండ‌రింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పాత్ర ఉందంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

ఇందుకు సంబంధించి విచార‌ణ‌కు రావాలంటూ రెండు సార్లు స‌మ‌న్లు పంపింది ఈడీ. ఇదిలా ఉండ‌గా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ ఛార్జిషీటును స‌మ‌ర్పించింది. ఈ కేసులో ఆమె పాత్ర స్ప‌ష్టంగా ఉంద‌ని ఇప్ప‌టికే అనుమానం వ్య‌క్తం చేసింది ఈడీ.

ప్ర‌త్యేకించి న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez)  తో పాటు ఆమె కుటుంబీకులు కూడా ఇందులో పాలు పంచుకున్నారంటూ ఆరోపించింది. పెద్ద ఎత్తున గిఫ్ట్ లు , వాచ్ లు, ఆభ‌ర‌ణాల రూపంలో తీసుకుంద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. కాగా తాజాగా ఈడీ ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ ఛార్జిషీట్ ను స‌మ‌ర్పించింది.

ఢిల్లీలోని పాటియాలా కోర్టులో రూ. 50,000 పూచీ క‌త్తుపై సోమ‌వారం మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరైంది. రూ. 200 కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణం కేసుకు సంబంధించి నిందితురాలిగా సుకేష్ చంద్ర‌శేఖ‌ర్ కు సంబంధించి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కోర్టుకు హాజ‌ర‌య్యారు.

అయితే తెల్ల చొక్కా, న‌లుపు ప్యాంటు ధ‌రించి న్యాయ‌వాది వేషంలో ఆమె కోర్టుకు హాజ‌రైన‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ప్రివెన్ష‌న్ ఆఫ్ మ‌నీ లాండ‌రింగ్ యాక్ట్ కోర్టు ముందు అనుబంధ ఛార్జ్ షీట్ దాఖ‌లు చేసింది ఈడీ.

ఈ ఛార్జిషీటును ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న కోర్టు జాక్వెలిన్ ను ఇవాళ హాజ‌రు కావాల‌ని ఆదేశించింది.

Also Read : చుప్ లో పాత్ర మ‌రిచి పోలేను – పూజా భ‌ట్

Leave A Reply

Your Email Id will not be published!