Jagan Richest CM : 29 మంది సీఎంలు కోటీశ్వరులు
ధనవంతుడు జగన్ పేదరాలు దీదీ
Jagan Richest CM : ఏడీఆర్ సంచలన ప్రకటన చేసింది. ప్రతి ఏటా ప్రజా ప్రతినిధులతో పాటు పార్టీల ఖర్చులు, ఆదాయ వివరాలు, విరాళాల గురించి వెల్లడిస్తుంది. ఒక రకంగా దేశంలో వాచ్ డాగ్ లాగా పని చేస్తోంది. తాజాగా సంచలన ప్రకటన చేసింది ఏడీఆర్. ప్రస్తుతం కొలువు తీరిన సీఎంల ఆస్తుల చిట్టాను బయట పెట్టింది.
అత్యంత పేద సీఎంగా పశ్చిమ బెంగాల్ కు చెందిన మమతా బెనర్జీ నిలిచారు. ఆమె ఆస్తులు కేవలం రూ. 15 లక్షలు మాత్రమే. ఇక దేశంలోనే అత్యంత ధనవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది ఏపీ సీఎం జగన్ రెడ్డి(Jagan Richest CM). ఆయా సీఎంలు ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ ల ఆధారంగా ఈ వివరాలు బయట పెట్టింది ఏడీఆర్.
రూ. 510 కోట్ల ఆస్తులతో ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి టాప్ లో నిలిచారు. 30 మంది సీఎంలలో 29 మంది కోటీశ్వరులుగా ఉంటే పశ్చిమ బెంగాల్ సీఎం దీదీ మాత్రం అత్యంత పేదరాలిగా నిలిచింది. ఆమెకు ఉన్న ఆస్తులు అతి తక్కువగా ఉన్నాయి.
ఆయా సీఎంల ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. అరుచాణల్ సీఎం పెమా ఖండు ఆస్తులు రూ. 163 కోట్లు, ఒడిశా సీఎం నవీన్ పట్నాక్ ఆస్తులు రూ. 63 కోట్లు, నాగాలాండ్ సిఎం ఆస్తులు రియోకు రూ. 46 కోట్లు ఉన్నాయి. పుదుచ్చేరి సీఎం ఎన్ .రంగస్వామి ఆస్తులు రూ. 38 కోట్లు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆస్తులు రూ. 23 కోట్లు, ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ బఘేల్ ఆస్తులు రూ. 25 కోట్లు.
మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా ఆస్తులు రూ. 15 కోట్లు, త్రిపుర సీఎం మానిక్ సాహా ఆస్తులు రూ. 13 కోట్లు ఉన్నాయి. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ఆస్తులు రూ. 11 కోట్లు, గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఆస్తులు రూ. 9 కోట్లు ఉన్నాయి.
కర్ణాటక సీఎం బొమ్మై ఆస్తులు రూ. 8 కోట్లు ఉండగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆస్తులు రూ. 8 కోట్లు , జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ఆస్తులు రూ. 8 కోట్లు ఉన్నాయి. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆస్తులు రూ. 8 కోట్లు , హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ రూ. 7 కోట్లు, మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆస్తులు రూ. 7 కోట్లు.
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆస్తులు రూ. 6 కోట్లు , ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆస్తులు రూ. 4 కోట్లు , సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమ్ ఆస్తులు రూ. 3 కోట్లు , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆస్తులు రూ. 3 కోట్లు , బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆస్తులు రూ. 3 కోట్లు , పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆస్తులు రూ. 1 కోటి ఉన్నాయి.
ఇక ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆస్తులు రూ. 1 కోటి ఉన్నాయి. మణి పూర్ సీఎం ఎన్ బీరేన్ సింగ్ ఆస్తులు రూ. 1 కోటి, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆస్తులు రూ. 1 కోటి, కేరళ సీఎం పినరయ్ విజయన్ ఆస్తులు రూ. 1 కోటి ఉండగా బెంగాల్ సీఎం దీదీ ఆస్తులు కేవలం రూ. 15 లక్షలు ఉన్నాయి. 30 మంది సీఎంలలో 29 మంది కోటీశ్వరులని పేర్కొంది ఏడీఆర్. 13 మంది సీఎంలపై హత్య , హత్యా యత్నం, కిడ్నాప్ , క్రిమినల్ , బెదిరింపు కేసులు ఉన్నాయి.
Also Read : టికెట్ నిరాకరణ ఎమ్మెల్సీకి రాజీనామా