Javed Akhtar Comment : పాక్ హింసోన్మాదంపై ‘కలం’ కవాతు
ఆ దేశపు గడ్డపై జావేద్ అక్తర్ ఫైర్
Javed Akhtar Comment : నిన్నటి దాకా ఆయనను ముస్లింగా మాత్రమే చూశారు కొందరు. కానీ ఇవాళ భారత జాతి యావత్తు ప్రశంసల వర్షం కురిపిస్తోంది. భారత దేశంతో నిత్యం కయ్యానికి కాలు దువ్వుతూ ఉగ్రవాదానికి ఊతం పోస్తూ నిత్యం దాడులకు పాల్పడుతూ, కాల్పులకు తెగబడుతున్న దాయాది పాకిస్తాన్ గడ్డపై నిప్పులు చెరిగాడు కవి..గేయ రచయిత.
అందుకే రవి చూడని లోకాన్ని కూడా కవి చూస్తాడని జావేద్ తో రూఢీ అయ్యింది. ఎందరో కవులు, కళాకారులు, గాయనీ గాయకులు, రచయితలు, జర్నలిస్టులు, మానవతా వాదులు హింసను నిరసిస్తున్నారు. ఉగ్రవాదానికి , మతోన్మాదానికి , చాంధస వాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
ఆందోళన చేస్తున్నారు. తమ తమ రంగాలలో ముందుండి గొంతెత్తుతున్నారు. తమ వాయిస్ వినిపిస్తున్నారు. ఇవాళ జావేద్ అక్తర్ తనలోని ఆగ్రహాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు.
తనను చంపినా సరే తన కలం ..తన గళం మానవత్వాన్ని కోరుకుంటుందని చెప్పాడు. అంతేనా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన పాళి కవాతు చేస్తుందని ప్రకటించాడు. ఆయన చేసిన ఈ సంచలన ప్రకటన భారత దేశంలో అనుకుంటే పొరపాటు పడినట్లే..కానే కాదు పాకిస్తాన్ లో నిర్వహించిన ఫైజ్ ఫెస్టివల్ లో జావేద్ అక్తర్(Javed Akhtar Comment) ఎలాంటి జంకు బొంకు లేకుండా నినదించాడు.
దేని కోసం మీ యుద్దం..మీ ఆవేశం..మీ ఉగ్రవాదం..ఎవరి కోసం చేస్తున్నారు..ఈ దాడులు.. ఎందు కోసం చేస్తున్నారో మీకైనా తెలుసా అని ప్రశ్నించాడు.
భారత దేశంలో పుట్టిన ఎవరైనా ద్వేషాలను వ్యాప్తి చేయలేదని స్పష్టం చేశాడు. అంతే కాదు మీరు బాంబులతో, తూటాలతో దాడులకు పాల్పడితే మేం ఎల్లప్పటికీ సాయం చేయడంలోనే దృష్టి సారిస్తామని ప్రకటించాడు.ఈ సందర్భంగా భారత దేశాన్ని నివ్వెర పరిచేలా, అస్థిర పరిచేలా చేసిన మానని గాయాన్ని జావేద్ అక్తర్ ప్రస్తావించారు(Javed Akhtar Comment).
ముంబైలో 26/11 జరిపిన దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఇంకా ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు భారత దేశం ఏనాడూ పాకిస్తాన్ పట్ల వివక్ష చూపలేదని గుర్తు చేశారు.
పాకిస్తానీ కళాకారులకు ఆతిథ్యం ఇచ్చినప్పటికీ పాకిస్తాన్ ఎప్పుడూ లతా మంగేష్కర్ కు ఆతిథ్యం ఇవ్వలేదని ఆరోపించారు జావేద్ అక్తర్. నేను ముంబైలోనే ఉంటున్నా. ఆనాటి దాడులను కళ్లారా చూశా. ఇప్పటికీ ఆ గాయం మానడం లేదన్నారు.
నుస్రత్ ఫతే అలీ కాన్ , మెహదీ హసన్ లాంటి పాక్ కళాకారులకు సాదర స్వాగతం పలికాము..కానీ మీరు ఏనాడైనా భారతీయ కళాకారులను ఆహ్వానించారా అని ప్రశ్నించారు కవీ..గేయ రచయిత.
ఈ సందర్బంగా జావేద్ అక్తర్ మాట్లాడిన మాటలతో కూడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కవికి సలాం చేస్తున్నానని ప్రకటించారు.
ఏది ఏమైనా పాకిస్తాన్ గడ్డపై అది చేస్తున్న ఆగడాలపై కలం కవాతు చేసిన కళా రవికి జాతి యావత్తు జేజేలు పలుకుతోంది.
Also Read : పఠాన్ మామాజాలం కలెక్షన్ల వర్షం