Javed Akhtar : జావేద్ అక్తర్ కు కోర్టులో చుక్కెదురు
పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు
Javed Akhtar RSS : ప్రముఖ గీత రచయిత జావేద్ అక్థర్ కు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై అభ్యంతర వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది క్రిమినల్ కేసు దాఖలు చేశారు. దీనికి సంబంధించి మేజిస్ట్రేట్ సమన్లను జారీ చేశారు. దీనిని సవాల్ చేస్తూ జావేద్ అక్తర్ పిటిషన్ ను(Javed Akhtar RSS) దాఖలు చేశారు. ఈ దావాను ముంబై లోని సెషన్స్ కోర్టు తిరస్కరించింది.
ఇదిలా ఉండగా జావేద్ అక్తర్ మార్చి 31న ములుంద్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. సంతోష్ దూబే అనే న్యాయవాది అక్టోబర్ , 2021లో జావేద్ అక్తర్ పై సబర్బన్ ములుండ్ లోని మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్లు 499 (పరువు నష్టం), 500 (పరువు నష్టం కోసం శిక్ష) కింద ఫిర్యాదు చేశారు.
ఇరు పక్షాల వాదనలు విన్న మేజిస్ట్రేట్ గత ఏడాది డిసెంబర్ ప్రముఖ గీత రచయిత అయిన జావేద్ అక్తర్ కు సమన్లు జారీ చేశారు. ప్రస్తుతం జావేద్ అక్తర్ కు 78 ఏళ్లు. తన లాయర్ ద్వారా సమన్లకు వ్యతిరేకంగా సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు అందుకు ఒప్పుకోలేదు. చివరకు తిరస్కరించింది. ఇదిలా ఉండగా కోర్టులో జావేద్ అక్తర్(Javed Akhtar RSS) పై దాఖలు చేసిన న్యాయవాది ఆర్ఎస్ఎస్ మద్దతుదారుడు.
రాజకీయ పరంగా ప్రచారం పొందాలనే ఉద్దేశంతోనే ఆర్ఎస్ఎస్ పై జావేద్ అక్తర్ తప్పుడు కామెంట్స్ చేశారంటూ ఆరోపించాడు. నాగ్ పూర్ లోని ప్రధాన కార్యాలయంలో ఉన్న హిందుత్వ సంస్థను అప్రతిష్టపాలు చేయడంతో పాటు ఆర్ఎస్ఎస్ లో చేరిన లేదా ఆ సంస్థలో చేరాలని అనుకునే వ్యక్తులను నిరుత్సాహ పరిచేందుకు , తప్పుదారి పట్టించేందుకు జావేద్ అక్తర్ కామెంట్స్ ఉన్నాయంటూ ఆరోపించాడు దూబే.
Also Read : బ్రహ్మానందం విశ్వరూపం