Jay Shah Praise : ముంబై – చాలా కాలం గ్యాప్ తర్వాత ఆసియా గేమ్స్ లో క్రికెట్ ను ప్రవేశ పెట్టారు. భారత మహిళా జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. అంతే కాదు బంగారు పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. మరో వైపు పురుషుల టీం ఆసియా కప్ ను సాధించింది. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి జే షా(Jay Shah) భారత మహిళా జట్టును ప్రశంసలతో ముంచెత్తారు.
Jay Shah Praise to Women Cricketers
ఈసారి 19వ ఆసియా క్రీడలు చైనా లోని హాంకాంగ్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. భారత విమెన్స్ టీమ్ రికార్డ్ సృష్టించింది. 19 పరుగుల తేడాతో శ్రీలంక మహిళా జట్టుపై ఘన విజయాన్ని నమోదు చేసింది. గోల్డ్ మెడల్ ను కైవసం చేసుకుంది. దేశానికి పేరు తీసుకు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు జే షా.
ఇదిలా ఉండగా టాస్ గెలిచి టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి శ్రీలంక మహిళా జట్టుకు 116 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్టార్ ప్లేయర్స్ స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్ కీలక పాత్ర పోషించారు. మంధాన 46 రన్స్ చేస్తే జెమీమా 42 పరుగులతో ఆకట్టుకుంది.
అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక జట్టు టాపార్డర్ ను భారత కుడి చేతి సీమర్ టిటాస్ సాధు అద్భుతంగా బౌలింగ్ చేసింది. శ్రీలంక పతనాన్ని శాసించింది. 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసింది.
Also Read : TDP Comment : తెలుగుదేశం కిం కర్తవ్యం