Jayalalitha Swagruha : ‘స్వగృహ’కు ఆమె ఆలంబన
జయలలిత కథ స్పూర్తి దాయకం
Jayalalitha Swagruha : తెలుసుకుంటే ప్రతి కథ చాలా గొప్పగా ఉంటుంది. ఒకప్పుడు అభిరుచితో ఆరంభమైన ఆలోచన ఇప్పుడు వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇప్పుడు తెలుగువారి లోగిళ్లలో భాగమై పోయింది స్వగృహ. రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశం దాటి విదేశాలలో కూడా తన హవా కొనసాగిస్తోంది. మూడు దశాబ్దాల కిందట జయలలిత(Jayalalitha Swagruha) మిఠాయి షాప్ ను ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ఈ బ్రాండ్ త్వరలో నగరంలో ఇంటి పేరుగా మారుతుందని ఆమె ఊహించ లేదు.
స్నేహితులు, కుటుంబ సభ్యులలో ఆమె వంటలకు ప్రసిద్ది పొందారు. ప్రత్యేక ఫంక్షన్లు, కార్యక్రమాలలో స్వీట్ లను తయారు చేసి పంపేది. ఆనోటా ఈనోటా ప్రశంసలు అందుకుంది. 1991లో ఒక చిన్న స్థలంలో జయలలిత తన వారితో కలిసి స్వగృహ ఫుడ్స్ ను ప్రారంభించేలా చేసింది. ప్రత్యేకించి ఆంధ్రా వంటకాలు ఆయా దుకాణాల్లో దొరకనప్పుడు, అందుబాటులో లేని సమయంలో జయలలిత బొబ్బట్లు అమ్మడం ప్రారంభించింది. పెద్ద ఎత్తున ఆదరణ లభించింది.
దీంతో సున్నుండలు, పూత రేకులు, ఇతర తెలుగు వారి సాంప్రదాయక రుచులను పరిచయం చేసింది. వివాహాలు, పుట్టిన రోజు వేడుకలు, పార్టీలు, ఇతర వేడుకలు, ఈవెంట్లకు స్వగృహ ఫుడ్స్(Jayalalitha Swagruha) కేరాఫ్ గా మారింది. ఈ స్టోర్ ను ఇప్పుడు ఫుడ్ కోర్ట్ గా మార్చేసింది.
దానికి అందమైన పేరు కూడా పెట్టింది. అదే స్వగ్రామ ఫుడ్ కోర్ట్ . దీనినే ఎస్ ఎఫ్ సీ అని కూడా అంటారు. ఏపీకి కాబోయే రాజధాని నగరం విశాఖ పట్టణంలో జయలలిత ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. కాలం ఎంత విచిత్రం కదూ. విజయం ఆమె స్వంతం అయ్యేందుకు తాను చేసే వంటలే తనను తీర్చిదిద్దేలా ..పేరు తీసుకు వచ్చేలా చేశాయి.
Also Read : అమ్మ చేతి వంట’ అద్భుతం