JD Lakshminarayana : ఆంగ్లంపై మోజు తెలుగుకు బూజు
మాజీ జేడీ లక్ష్మీనారాయణ
JD Lakshminarayana : విజయవాడ – సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వాసగిరి వెంకట లక్ష్మీ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన మాతృ భాష మహాసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆంగ్లంపై మోజు తెలుగు భాషకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
JD Lakshminarayana Comments Viral
మాతృ భాషను విస్మరిస్తే ప్రమాదమని హెచ్చరించారు. తెలుగును నిర్లక్ష్యం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు జేడీ లక్ష్మీ నారాయణ(JD Lakshminarayana). తెలుగు భాషను కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు.
ఉపాధి కోసం ఆంగ్లం నేర్చు కోవడం అనేది ఒక అపోహ మాత్రమేనని అన్నారు. పలు రంగాలలో ప్రతిభ చూపిస్తున్న వారంతా మాతృ భాషలో విద్యను అభ్యసించిన వారేనని చెప్పారు. ఇన్నేళ్లయినా ఇంకా తెలుగు బతికే ఉందని కానీ అది రాను రాను అంతరించి పోయే స్థితిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు జేడీ లక్ష్మీ నారాయణ.
ఏపీపీసీసీ మాజీ చీఫ్ కర్రెడ్డి తులసీ రెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకు తెలుగు భాషను వాడడం తక్కువై పోతోందని వాపోయారు. ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు తెలుగును వెలుగొందేలా చూడాలని కోరారు.
టీడీపీ సీనియర్ నాయకులు మండలి బుద్ద ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు భాషను విస్తృతంగా వాడుక లోకి తీసుకు రావాలని, అప్పుడే దానిని కాపాడు కోగలమని అన్నారు.
Also Read : Daggubati Purandeswari : తెలుగును కాపాడుకోక పోతే కష్టం