Jill Biden : ఇరు దేశాల మ‌ధ్య విద్య ముఖ్యం

యుఎస్ ప్ర‌థ‌మ మహిళ జిల్ బైడెన్

Jill Biden : అమెరికా, భార‌త దేశాల మ‌ధ్య విద్య అత్యంత ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు యుఎస్ ప్ర‌థ‌మ మ‌హిళ జిల్ బైడెన్. వ‌ర్జీనియా లోని నేష‌నల్ సైన్స్ ఫౌండ‌నేష‌న్ లో భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ , జిల్ బైడెన్(Jill Biden) పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచ స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు విద్య అత్యంత కీల‌క‌మైన పాత్ర పోషిస్తుంద‌ని చెప్పారు. ఇరు దేశాల మ‌ధ్య ఇప్పటికీ విద్యా ప‌రంగా ఎన‌లేని బంధాన్ని క‌లిగి ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాము స్టార్ట‌ప్ ఇండియాపై ఫోక‌స్ పెట్టామ‌న్నారు. ఇవాళ టెక్నాల‌జీని తాము ఎక్కువ‌గా ఉప‌యోగించ‌కునేలా ప్లాన్ చేశామ‌ని చెప్పారు. విద్య‌, నైపుణ్యం, ఆవిష్క‌ర‌ణ‌లపైనే ఫోక‌స్ పెట్టామ‌న్నారు పీఎం. రాబోయే కాలంలో టెక్ దశాబ్దంగా మార్చ‌డ‌మే త‌న ముందున్న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు మోదీ.

ఇరు దేశాల‌కు సంబంధించి సాంకేతిక‌త అత్యంత భాగ‌స్వామిగా ఉంద‌న్నారు. నైపుణ్యం క‌లిగిన యువ‌త ఎక్కువ‌గా ఉండ‌డం లాభించే అంశ‌మ‌న్నారు. వారికి స‌రైన రీతిలో నైపుణ్యాల‌ను అందించ గ‌లిగితే అద్భుతాలు సృష్టించ వ‌చ్చ‌ని చెప్పారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. దీని వ‌ల్ల స్థిర‌మైన అభివృద్దికి మార్గం ఏర్ప‌డుతుంద‌న్నారు.

Also Read : Satya Pal Malik : అదానీ సొమ్మంతా ప్ర‌ధాని మోదీదే

Leave A Reply

Your Email Id will not be published!