Jio Air Fiber Launch : జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభం
ఇక నెట్ కనెక్టివిటీలో సంచలనం
Jio Air Fiber Launch : భారతీయ టెలికాం రంగంలో మరో సంచలనానికి తెర తీసింది రిలయన్స్ గ్రూప్. మంగళవారం జియో ఎయిర్ ఫైబర్(Jio Air Fiber Launch ) ను ప్రారంభించింది. దీని వల్ల ఎలాంటి నెట్ కనెక్టివిటీలో ఇబ్బందులు లేకుండా నేరుగా కోరుకున్న స్పీడ్ లో జియో ఫైబర్ పని చేస్తుంది.
ఇందుకు సంబంధించి జియో ఫైబర్ ను వాడుకునే యూజర్లకు ప్లాన్స్ కూడా ఈసందర్బంగా ప్రకటించింది రిలయన్స్ జియో. రూ. 599 ప్లాన్ తీసుకుంటే 30 ఎంబీపీఎస్ ఉచితంగా డేటా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాన్ లో డిస్నీ హాట్ స్టార్ , సోనీ లైవ్ , జీ5 తో పాటు మరో 11 ఓటీటీ ప్లాట్ ఫారమ్ లను ఎంజాయ్ చేయొచ్చని తెలిపింది .
Jio Air Fiber Launch Viral
ఇక రూ. 899 ప్లాన్ లో 100 ఎంబీపీఎస్ అపరిమితమైన డేటా ఇస్తున్నట్లు తెలిపింది. ఓటీటీలోని అన్ని యాప్ లు లభిస్తాయని స్పష్టం చేసింది. రూ. 1,199 ప్లాన్ లో 100 ఎంబీపీఎస్ అపరిమిత డేటా వాడుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు రిలయన్స్ జియో పేర్కొంది.
రూ. 1,199 ప్లాన్ లో 100 ఎంబీపీఎస్ డేటా తో పాటు ఓటీటీలోని అన్ని కూడా వర్తిస్తాయని తెలిపింది. నెట్ ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ , డిస్నీ హాట్ స్టా్ , మరో 13 అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. ఇక జియో ఎయిర్ ఫైబర్ మ్యాక్స్ ధర రూ. 1,499 గా ఉందని తెలిపింది. ఓటీటీలోని అన్ని యాప్ లు వర్తిస్తాయని పేర్కొంది.
జియో ఫైబర్ మ్యాక్స్ రూ. 2,499 ప్లాన్ లో 500 ఎంబీపీఎస్ అపరిమితమైన డేటా లబిస్తుందని తెలిపింది. ఓటీటీ యాప్ లు లభిస్తాయని స్పష్టం చేసింది రిలయన్స్ జియో. 1 జీబీపీఎస్ అపరితమైన డేటా వర్తింప చేస్తున్నట్లు పేర్కొంది.
Also Read : Women’s Reservation Bill : నూతన పార్లమెంట్ లో మహిళా బిల్లు