Jitta Balakrishna Reddy : మాన‌సికంగా బీజేపీకి దూర‌మ‌య్యాను

జిట్టా బాల‌కృష్ణా రెడ్డి షాకింగ్ కామెంట్స్

Jitta Balakrishna Reddy : భార‌తీయ జ‌న‌తా పార్టీకి బిగ్ షాక్ త‌గ‌ల‌నుందా. మ‌రో బీజేపీ నేత జిట్టా బాల‌కృష్ణా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. బుధ‌వారం జిట్టా మీడియాతో మాట్లాడారు. తాను ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్నా మాన‌సికంగా దూరంగా ఉంటున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌ను కాంగ్రెస్ పార్టీలోకి ర‌మ్మ‌ని పిలుస్తున్నార‌ని, త‌న అనుచ‌రుల‌తో మాట్లాడి త‌గు నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంద‌న్నారు జిట్టా బాల‌కృష్ణా రెడ్డి(Jitta Balakrishna Reddy). ఇటీవ‌లే బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ ను త‌ప్పించింది పార్టీ హైక‌మాండ్. ఆయ‌న స్థానంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది.

Jitta Balakrishna Reddy Will Decide

ఆయ‌న వ‌చ్చాక చ‌క్క‌దిద్దే ప‌నిలో ప‌డ్డారు. ఇవాళ బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ పై ఆ పార్టీకి చెందిన నేత‌లు ఆందోళ‌న చేప‌ట్టారు. త‌మ‌ను ప‌ట్టించు కోవ‌డం లేదంటూ నిర‌స‌న‌కు దిగారు. మ‌రో వైపు పార్టీ చీఫ్ ప‌దే ప‌దే మీడియాతో మాట్లాడుతున్నారే త‌ప్పా స‌మ‌స్య‌ల‌పై ఫోక‌స్ పెట్ట‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు లేక పోలేదు. ఈ త‌రుణంలో జిట్టా బాల‌కృష్ణా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు భార‌తీయ జ‌న‌తా పార్టీపై. ఉద్య‌మ ఆకాంక్ష‌లు నెర‌వేరుతాయ‌ని తాను బీజేపీలో చేరాన‌ని కానీ ఆ దిశ‌గా క‌నిపించ‌డం లేదంటూ వాపోయారు.

నార్త్ రాష్ట్రాల‌లో బీజేపీ అబద్దాలు చెబితే న‌మ్ముతారేమో కానీ ద‌క్షిణాదిన ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిని విమ‌ర్శించే స్థాయి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి లేదంటూ పేర్కొన్నారు. దీంతో జిట్టా కాంగ్రెస్ పార్టీలో చేర‌డం దాదాపు ఖాయ‌మైన‌ట్టేన‌ని ఆయ‌న అనుచ‌రులు అంటున్నారు. రాబోయే రోజుల్లో ఇంకెంత మంది జంప్ జిలానీలు ఉంటారో వేచి చూడాలి.

Also Read : G Kishan Reddy : అవిశ్వాస తీర్మానం ఓ నాట‌కం

 

Leave A Reply

Your Email Id will not be published!