Al-Zawahiri Killed : అల్ ఖైదా చీఫ్ అల్-జవహరి ఖతం
ప్రకటించిన అమెరికా చీఫ్ బైడెన్
Al-Zawahiri Killed : పెద్దన్న అమెరికా ఎట్టకేలకు తన పట్టు నెగ్గించుకుంది. తమను ముప్పు తిప్పలు పెడుతూ కంటి మీద నిద్ర లేకుండా చేస్తూ వస్తున్న అల్ ఖైదా చీఫ్ అల్ – జవహరిని ఖతం చేసింది.
ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్. దీంతో ఒక్కసారిగా యావత్ ప్రపంచం ఉలికి పాటుకు గురైంది.
గత కొంత కాలంగా తమను టార్గెట్ చేస్తూ వచ్చిన అల్ – జవహరిని సీక్రెట్ ఆపరేషన్ చేపట్టడం జరిగిందన్నారు. ఈ మేరకు అల్ జవహరిని హత మార్చినట్లు స్పష్టం చేశారు బైడెన్.
ఇదిలా ఉండగా తమ దేశానికి చెందిన నిఘా వర్గాలు జల్లెడ పట్టాయని, అల్ జవహరి తన ఫ్యామిలీతో కలిసి ఆఫ్గనిస్తాన్ లోని కాబూల్ లో ఓ ఇంట్లో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
స్పెషల్ ఆపరేషన్ ను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా అమెరికా ఆర్మీ తనను కోరిందన్నారు బైడెన్. వెంటనే పర్మిషన్ ఇవ్వడం జరిగిందని , ద్రోన్ డాడులతో విరుచుకు పడినట్లు తెలిపారు.
అయితే ఈ ఆకస్మిక దాడులలో సామన్య పౌరులు ఏ ఒక్కరు కూడా గాయపడ లేదని స్పష్టం చేశారు. అల్ జవహరి మృతితో 9/11 ఆనాడు అమెరికాలో చోటు చేసుకున్న ఘోరమైన సంఘటనలో బాధితులకు న్యాయం చేసినట్లయిందని తెలిపారు బైడెన్.
ఇదిలా ఉండగా 2001లో జరిగిన ఈ ఘటన ఉగ్రదాడిలో ఒసామా బిన్ లాడెన్ తో పాటు అల్ జవహరి(Al-Zawahiri) కూడా ప్రధాన పాత్రధారిగా ఉన్నాడు.
ఈ సందర్భంగా ప్రపంచంలో ఉగ్రవాదులు ఎవరైనా తమతో పెట్టుకుంటే అల్ ఖైదా చీఫ్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు బైడెన్.
Also Read : అల్ జవహరి హతం తాలిబన్ ఆగ్రహం