Jogi Ramesh Son Arrest : మాజీ మంత్రి కుమారుడు రాజీవ్ అరెస్ట్

ఈ వ్యవహారంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేసింది...

Jogi Ramesh : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ బండారం బహిర్గతమవుతోంది. ఏసీబీ మరిన్ని వివరాలు సేకరిస్తుండడంతో జోగి కుమారుడు మెడకు ఉచ్చు బిగిస్తోంది. కాగా విజయవాడ రూరల్ మండలంలోని అంబాపురంలో అగ్రిగోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో జోగి కుటుంబం అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన అక్రమాలపై ఏడాది క్రితం అగ్రిగోల్డ్ యాజమాన్యం ఫిర్యాదు చేసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులో కదలిక వచ్చింది. అంబాపురంలో సర్వే నెం. 88లోని 2160 గజాల అగ్రిగోల్డ్ స్థలాన్ని సీఐడీ గతంలోనే అటాచ్ చేసింది. వేరేవారి పేరుపై నకిలీ రిజిస్ట్రేషన్ చేసి మళ్లీ తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు జోగి రమేష్(Jogi Ramesh) కుట్ర చేసినట్లు రెవెన్యూ నివేదికలో తేటతెల్లమైంది. వేరే వారి దగ్గర నుంచి ఈ స్థలాన్ని జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, జోగి సోదరుడు వెంకటేశ్వరరావు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మళ్లీ ఈ స్థలాన్ని విజయవాడకు చెందిన వేరే వారికి అమ్మేశారు. ఈ విషయంలో తమ పేరు బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు.

Jogi Ramesh Son Arrest….

ఈ వ్యవహారంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి మంత్రి జోగి రమేష్ ఉన్నారని అధికారులు చెబుతున్నారు. మొత్తం రూ. 7 కోట్లు విలువైన స్థలం కబ్జా అయినట్లు అధికారులు లెక్క తేల్చారు. కాగా సీఐడీ తనఖాలో ఉన్న స్థలాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేశారనే అంశంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా మాజీ మంత్రి జోగి రమేష్ ఈరోజు (మంగళవారం) సాయంత్రం మంగళగిరి డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరుకానున్నారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు రావాలని పోలీసుల నోటీసులు ఇచ్చారు. కాగా మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది.

ఇబ్రహీంపట్నంలోని రమేష్(Jogi Ramesh) నివాసంలో మంగళవారం తెల్లవారుజామున 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది. రమేష్ ఇంట్లో ఉన్న కీలక డాంక్యుమెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. చాలామంది బాధితులు ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు అధికారుల దృష్టికి రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం.

Also Read : AP High Court: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

Leave A Reply

Your Email Id will not be published!