Jonnavithula Ramalingeswara Rao : మాతృ భాషతోనే వికాసం
మాతృ భాష మహా సభలో వక్తలు
Jonnavithula Ramalingeswara Rao : విజయవాడ – మాతృ భాషతోనే మానవ వికాసం సాధ్యమని, మాతృ భాషను విస్మరిస్తే ఉనికినే కోల్పోతామని అన్ని పార్టీల నాయకులు, భాషా కోవిదులు, ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి కోసం పరభాషా అవసరమనే వాదన తప్పని, మాతృ భాషలోనే సృజనాత్మకత ఏర్పడుతుందని స్పష్టం చేశారు.
Jonnavithula Ramalingeswara Rao Words
చైనా, జర్మనీ, జపాన్, తదితర దేశాలన్నీ స్వంత భాషలను ఉపయోగిస్తూనే ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకున్నాయని పేర్కొన్నారు. విజయవాడలో మాతృభాషా మహాసభ నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు(Jonnavithula Ramalingeswara Rao) మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయాక రాష్ట్రంలో తెలుగు భాష చూపుతున్న అనాదరణపై ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో మాతృభాషకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, మీడియాలో సైతం ఆయా ప్రాంతాల మాండలికాలతోనే ఉచ్ఛారణ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. కాని ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉందన్నారు.
తెలుగుకు ప్రాధాన్యత తగ్గి పోతుందని ఇది ఘోరమైన తప్పిందగా పేర్కొన్నారు. మాతృ భాష సంస్కృతితో ముడిపడి ఉంటుందన్నారు. అదే మనలో వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుందని స్పష్టం చేశారు మాతృభాష అంతరించి పోతే ఆ జాతి అనర్థాల వలయంలో చిక్కుకుని చివరకు ఉనికినే కోల్పోందనే విషయం గుర్తించాలన్నారు.
Also Read : Udhayanidhi Stalin : ఉదయనిధిపై సీజేఐకి ఫిర్యాదు