Jos Butler Bumrah : బుమ్రాను చూసి భయపడ్డా – బట్లర్
ఇంగ్లండ్ స్టార్ హిట్టర్ షాకింగ్ కామెంట్స్
Jos Butler Bumrah : ప్రపంచ క్రికెట్ లో మోస్ట్ పాపులర్ క్రికెటర్ జోస్ బట్లర్. స్టార్ హిట్టర్ గా పేరొందాడు. అంతే కాదు ఒక్కసారి మైదానంలోకి దిగాడంటే పరుగుల వరద పారించాల్సిందే. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో పాటు ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో కేరళ స్టార్ హిట్టర్ సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
గత ఏడాది 2022లో జరిగిన ఐపీఎల్ టోర్నీలో దుమ్ము రేపాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు జోస్ బట్లర్ కు పదోన్నతి కల్పించింది. పొట్టి ఫార్మాట్ టీ20కి కెప్టెన్ గా చేసింది. ఇదిలా ఉండగా స్పోర్ట్స్ ఛానల్ తో జోస్ బట్లర్ మాట్లాడాడు. మీ కెరీర్ లో మీరు ఏ బౌలర్ ను చూసి భయపడ్డారంటూ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
భారత క్రికెట్ కు చెందిన స్టార్ బౌలర్, స్పీడ్ స్టర్ గా పేరొందిన జస్ప్రీత్ బుమ్రాను చూసి తాను ఒకసారి భయపడ్డానంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం జోస్ బట్లర్ చేసిన కీలక కామెంట్స్ ఒక్కసారిగా బుమ్రా ఎంత గొప్ప బౌలరో చెప్పకనే(Jos Butler Bumrah) చెప్పింది. ఇదిలా ఉండగా ఇటీవల బుమ్రా గురించి పాకిస్తాన్ మాజీ స్టార్ బౌలర్ అబ్దుల్ రజాక్ నోరు పారేసుకున్నాడు.
బుమ్రా ఓ బేబీ (పిల్ల) బౌలర్ అంటూ పేర్కొన్నాడు. దీనిపై బుమ్రా అభిమానులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. మంచి పద్దతి కాదంటూ హితవు పలికారు. ఇదిలా ఉండగా జోస్ బట్లర్ కు బౌలింగ్ చేయాలంటే బౌలర్లు జడుసుకుంటారు. అలాంటి బట్లర్ బుమ్రాకు కితాబు ఇవ్వడం ఆసక్తని రేపింది. విస్తు పోయేలా చేసింది.
Also Read : ఆసిస్ తో భారత్ అమీ తుమీకి రెడీ