Khalid Jawed : పాత్రికేయ రచన సాహిత్యానికి ముప్పు
ఉర్దూ నవలా రచయిత ఖలీద్ జావెద్
Khalid Jawed : ప్రముఖ నవలా రచయిత ఖలీద్ జావెద్(Khalid Jawed) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏది సీరియస్ సాహిత్యమో అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. ప్రత్యేకించి జర్నలిస్టిక్ (పాత్రికేయ) రచనలు తీవ్రమైన సాహిత్యానికి పెను ముప్పుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ది ప్యారడైజ్ ఆఫ్ ఫుడ్ రచయిత ఖలీద్ జావెద్.
వాస్తవానికి 2014లో నౌమత్ ఖానా గా దీనిని ఉర్దూలో ప్రచురించారు. దీనిని ఇంగ్లీష్ లో అనువాదం చేశారు. సాహిత్యానికి రాజకీయ, సామాజిక, నైతిక ఆందోళనలు ఉన్నప్పటికీ దానిని పాఠకులకు వార్తా పత్రికల వంటి మార్గాల ద్వారా ప్రచురించడం, ప్రదర్శించడం చేయకూడదని పేర్కొన్నారు.
ప్రస్తుత యుగంలో పాఠకుల పేలవమైన అభివృద్ది గురించిన రిపోర్టింగ్ లు సాహిత్య రచనలుగా మారడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు ఖాలీద్ జావెద్. ఆయన రాసిన నవలలో ఆహారం, మరణం, దేశం ఎదుర్కొంటున్న స్థితి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వచ్చారు.
ఒక రకంగా చెప్పాలంటే సీరియస్ సాహిత్యానికి అతి పెద్ద ముప్పుగా మారింది పాత్రికేయ రచన అని ఆరోపించారు. సాహిత్యం పేరుతో రాస్తున్నారు. దానినే నవలగా మార్చేస్తున్నారంటూ ఆందోళన చెందారు. సామాజిక వాస్తవికతను యథాతథంగా ప్రదర్శించడం గత 25 ఏళ్లుగా జరుగుతోందన్నారు ఖాలిద్ జావెద్(Khalid Jawed).
జామియా మిలియా యూనివర్శిటీ ప్రొఫెషర్ జావెద్ ఇటీవల జేసీబీ నుంచి బహుమతి అందుకున్నారు. దానికి రూ. 25 లక్షల నగదు పారితోషకం కూడా లభించింది.
గంభీరమైన సాహిత్యం అంతర్ దృష్టితో కూడుకున్నదని పేర్కొన్నారు. ఆయన రాసిన ఏక్ ఖంజర్ పానీ మే, ఆఖ్రీ దావత్ , మౌత్ కితాబ్ రచనలు అత్యధికంగా అమ్ముడు పోయాయి.
Also Read : పవన్ కళ్యాణ్ అంతర్ముఖుడు