Temjen Imna Along : అంబాసిడ‌ర్ లో జ‌ర్నీ సూప‌ర్ – ఇమ్నా

ఇప్ప‌టికీ అదే వాహ‌నం వాడుతా

Temjen Imna Along : ఈ దేశంలో ఎన్నో కార్లు ఉన్నాయి. కానీ ఒక‌ప్పుడు స్కూట‌ర్ల‌లో బ‌జాజ్ , కార్ల‌లో మొద‌ట‌గా పేరు గుర్తుకు వ‌చ్చేది మాత్రం అంబాసిడ‌ర్ కారు. ప్ర‌స్తుతం మార్కెట్ లో పాత కార్లు ల‌భించ‌డం లేదు. కొత్త ర‌కం మాడ‌ల్స్ తో తిరిగి మార్కెట్ లోకి రానున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది అంబాసిడ‌ర్ త‌యారీ సంస్థ‌. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం ప్ర‌తి సోమ‌వారం ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు బ‌య‌లు దేర‌డం ప‌నిగా పెట్టుకున్నారు ప్ర‌ముఖ బీజేపీ నాయ‌కుడు, నాగాలాండ్ రాష్ట్ర మంత్రి టెమెజ్ ఇమ్నా అలోంగ్(Temjen Imna Along).

ఒక‌ప్పుడు టీచ‌ర్ గా ప‌ని చేశాడు. ఆ త‌ర్వాత భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు. విస్తృతంగా రాష్ట్రంలో ప‌ర్య‌టించాడు. ఆపై బీజేపీకి రాష్ట్ర చీఫ్ గా ఎన్నిక‌య్యాడు. ప‌వ‌ర్ లోకి వ‌చ్చేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్. మ‌నోడు నిత్యం ఏదో ఒక అంశాన్ని ప్ర‌స్తావిస్తాడు. ఆపై స్పూర్తి దాయ‌కండా ఉండే క‌థ‌ల్ని చెబుతాడు.

ప‌ని చేయండి..ప్ర‌శాంతంగా ఉండండి. ఆరోగ్యంగా జీవించేందుకు ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం అవ‌స‌ర‌మ‌ని, దానిని పొందేందుకు ఎక్క‌డికో వెళ్లాల్సిన ప‌ని లేదంటాడు ఇమ్నా. భార‌త దేశంలో మోస్ట్ సోష‌ల్ మీడియా పాపుల‌ర్ లీడ‌ర్ల‌లో మోదీ త‌ర్వాత బీజేపీలో ఇమ్నానే కావ‌డం విశేషం. ఇవాళ అంబాసిడ‌ర్ ను గుర్తు చేస్తూ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు ఇమ్నా.

Also Read : ఢిల్లీ సీఎం ఆహ్వానం కోసం వేచి ఉన్నా

Leave A Reply

Your Email Id will not be published!