PM Modi : జేపీ నడ్డా పనితీరు భేష్ – మోదీ
బీజేపీ పార్లమెంటరీ మీటింగ్ లో
PM Modi : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆకాశానికి ఎత్తేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi). ఆయన పనితీరు బాగుందని కితాబు ఇచ్చారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు ప్రధానమంత్రి హాజరై ప్రసంగించారు. ఉభయ సభల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు బాగా సమాధానం ఇచ్చారంటూ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా జనవరి 31న పార్లమెంటరీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. కేంద్ర బడ్జెట్ పై కూడా చర్చించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి అదానీ సంస్థ నిర్వాకంపై పార్లమెంట్ లో వివాదం చోటు చేసుకుంది. సభ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.
ఉభయ సభలకు అంతరాయం కలిగించిన అదానీ స్టాక్ సమస్యపై ప్రభుత్వం పార్లమెంట్ ముందుకు వచ్చి స్పందించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అదానీ గ్రూప్ పై వచ్చిన స్టాక్ మానిప్యులేషన్ ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలని కోరాయి. ఇందుకు సంబంధించి వ్యూహాన్ని నిర్ణయించేందుకు ప్రతిపక్ష పార్టీలు ఇవాళ కూడా సమావేశం నిర్వహించాయి.
ఈరోజుతో పార్లమెంట్ లో ప్రతిష్టంభనకు తెర పడుతుందని విపక్షాలు భావిస్తున్నాయి. అదానీ గ్రూప్ కు వ్యతిరేకంగా హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికపై పార్లమెంట్ లో చర్చకు ప్రధాని మోదీ అంగీకరించేంత దాకా వెనక్కి తగ్గేది లేదంటున్నాయి ప్రతిపక్షాలు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను బలవంతంగా వాయిదా వేయడంపై పార్లమెంట్ లో ఇరుకున పెడుతోంది కాంగ్రెస్ పార్టీ.
Also Read : నాపై కాదు వాజ్ పేయ్ పై దాడి