JP Nadda : కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ దుకాణం
నిప్పులు చెరిగిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు
JP Nadda : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన కామెంట్స్ చేశారు. ఆయన సీఎం కేసీఆర్ , కుటుంబంపై నిప్పులు చెరిగారు. భారత రాష్ట్ర సమితి పార్టీ కాదని అది కల్వకుంట్ల కుటుంబ పార్టీ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా జనం నమ్మరన్నారు.
గురువారం కరీంనగర్ జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా(JP Nadda) ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు దోచుకునే దొంగలకంటే దారుణంగా తయారయ్యారంటూ ఆరోపించారు. ధరణి పోర్టల్ పేరుతో అందినంత మేర ప్రభుత్వ భూములను కొల్ల గొడుతున్నారని మండిపడ్డారు.
తాము పవర్ లోకి వచ్చాక వాళ్ల అక్రమ సంపాదన అంతా బయటకు తీస్తామని హెచ్చరించారు జేపీ నడ్డా. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే బీఆర్ఎస్ అనే కొత్త దుకాణం తెరిచిండంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇంత మంది ప్రజా ప్రతినిధులు ఉన్నారని..కానీ ఒక్క ఎమ్మెల్సీ కవితను మాత్రమే ఎందుకు దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయని ప్రశ్నించారు.
ఆమె తప్పు చేసింది కాబట్టే నోటీసులు ఇచ్చారని అన్నారు. ఆమె తప్పు చేసి తమ మీదకు నెట్టి వేసే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఏదో ఒక రోజు నిజం బయటకు వస్తుందన్నారు. తప్పు చేసిన వాళ్లు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు జేపీ నడ్డా(JP Nadda). తమ ప్రభుత్వం తీసుకు వచ్చిన వెల్ నెస్ సెంటర్లను బస్తీ దవఖానాగా మార్చిండని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓవైసీతో చేతులు కలిపిన కేసీఆర్ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం జరిపేందుకు ఇష్ట పడడని అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు. బండి సంజయ్ పాదయాత్ర ఇంతటితో ముగియ లేదన్నారు. త్వరలోనే మళ్లీ ఇంటింటికీ ఊరూరా పర్యటిస్తామన్నారు జేపీ నడ్డా.
Also Read : పండుటాకులు’ పనికి రారా