JP Nadda : కుటుంబాల కోసమే ఇండియా కూటమి
బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా
JP Nadda : భారతీయ జనతా పార్టీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ప్రతిపక్షాల కూటమి ఇండియాను లక్ష్యంగా చేసుకుని నిప్పులు చెరిగారు. కేవలం వారు తమ కుటుంబాలను కాపాడుకునేందుకు , వారు అక్రమంగా సంపాదించిన ఆస్తులను రక్షించు కునేందుకు ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
JP Nadda Slams India Alliance
ఇండియా కూటమి వల్ల దేశానికి ఒరిగింది ఏమీ లేదన్నారు. అందులో జాయిన్ అయిన వాళ్లకు ఎలాంటి చరిత్ర ఉందో ప్రజలకు తెలుసన్నారు జేపీ నడ్డా(JP Nadda). ప్రజలు ముచ్చటగా మూడోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి ఓటు వేస్తారని, తిరిగి తామే పవర్ లోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
దేశంలోని అన్ని పార్టీలు ఏకమైనా బీజేపీ సర్కార్ ను కూల్చలేరని స్పష్టం చేశారు. పార్టీ పరంగా మేరి మాతి మేరా దేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు బీజేపీ చీఫ్. ఇండియా కూటమిలోని పార్టీలను చూస్తే కుటుంబానికి చెందిన వారు తప్ప ఏ ఒక్కరు ఇతర నేతలు లేరని ఎద్దేవా చేశారు.
వీళ్లలో వీరికే సయోధ్య లేదని ఇక దేశాన్ని ఎలా పాలిస్తారంటూ ప్రశ్నించారు జేపీ నడ్డా. ఇండియా కూటమి వాళ్ల కుటుంబాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారని, కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్దిలో ఎలా నెంబర్ 1 చేయాలనే దానిపై ఫోకస్ పెట్టారని చెప్పారు. ఇండియా కూటమికి తమకు ఉన్న తేడా ఇదేనని పేర్కొన్నారు.
Also Read : K Annamalai : ఉదయనిధిపై అన్నామలై ఫైర్