Justice Sanjay Kumar: జగన్ అక్రమ ఆస్తుల కేసుల నుంచి వైదొలగిన జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ !

జగన్ అక్రమ ఆస్తుల కేసుల నుంచి వైదొలగిన జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ !

Justice Sanjay Kumar: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుతో ప్రమేయం ఉన్న భారతి సిమెంట్‌ కార్పొరేషన్, జగతి పబ్లికేషన్స్, విజయసాయిరెడ్డిలకు వ్యతిరేకంగా ఈడీ దాఖలుచేసిన కేసు విచారణ నుంచి జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. జగన్‌ అక్రమాస్తుల కేసులకు సంబంధించి నమోదైన సీబీఐ కేసుల్లో తీర్పు వెలువడిన తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పులు ఇవ్వాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినా ఆ పద్థతినే అనుసరించాలని అప్పట్లో స్పష్టం చేసింది.

Justice Sanjay Kumar Exit..

హైకోర్టు తీర్పును గతేడాది మే నెలలో ఈడీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. బుధవారం ఈడీ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌(Justice Sanjay Kumar)లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే… కేసు ప్రారంభమైన వెంటనే తాను విచారణ నుంచి తప్పుకొంటున్నానని జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. వాదనలు వినిపించేందుకు ఇరుపక్షాల న్యాయవాదులు సిద్థమవగా జస్టిస్‌ సంజీవ్‌ కుమార్‌ లేని ధర్మాసనం ముందు పిటిషన్‌ను లిస్ట్‌ చేయనున్నట్టు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా వెల్లడించారు. సెప్టెంబరు 2 నుంచి మొదలయ్యే వారంలో సీజేఐ ఆదేశాల మేరకు మరో ధర్మాసనం ముందు లిస్ట్‌ చేయాలని ఆయన ఆదేశించారు.

Also Read : D Haritha: అనంతపురం జేసీగా హరిత పోస్టింగ్‌ రద్దు !

Leave A Reply

Your Email Id will not be published!