Justice Yashwant Varma: ఢిల్లీ హైకోర్టు జడ్జి బంగ్లాలో అగ్నిప్రమాదం ! బయటపడ్డ నోట్ల కట్టలు !

ఢిల్లీ హైకోర్టు జడ్జి బంగ్లాలో అగ్నిప్రమాదం ! బయటపడ్డ నోట్ల కట్టలు !

Justice Yashwant Varma : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ బంగ్లాలో అగ్నిప్రమాదం జరిగింది. జడ్జి బంధువుల సమాచారం మేరకు ఘటనా స్థలాలనికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదులోనికి తీసుకున్నారు. అయితే మంటలను ఆర్పేందుకు వెళ్ళిన సిబ్బంది… ప్రమాదంలో బయటపడ్డ కోట్లాది రూపాయల నోట్ల కట్టలు చూసి అవాక్కయ్యారు. మంటలు ఆర్పుతున్న సమయంలో ఒక రూంలో పెద్ద మొత్తంలో డబ్బుల కట్టలు ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. మంటల్లో దాదాపు ఐదారు కోట్లు కూడా దగ్ధమైనట్లు తెలుస్తోంది. అయితే మిగిలిన మొత్తం డబ్బుల కట్టలను ఫైర్ సిబ్బంది ఫోటోలు తీసి తమ ఉన్నతాధికారులకు పంపించగా… ఆయన ఢిల్లీ కమిషనర్‌ కు పంపినట్లు సమాచారం. వెంటనే ఢిల్లీ కమిషనర్ ఈ ఫోటోలను కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షాకు పంపించారని… ప్రధాని దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా ఆ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న మోదీ దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

Justice Yashwant Varma – Exposed Cash in Fire Accident

ఈ ఘటనలో సుమారు 50 కోట్ల వరకూ నోట్ల కట్టలు బయటపడ్డాయని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఇవేవీ లెక్కల్లో చూపించకపోవడంతో…ఇంత మొత్తం ఎవరివన్న దానిపై కూడా దర్యాప్తు జరపాలని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది. దీనితో ఢిల్లీ హైకోర్టు(Delhi High COurt) న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై(Justice Yashwant Varma) అంతర్గత దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు జస్టిస్ యశ్వంత్ వర్మపై ఢిల్లీ హైకోర్టు సీజే నుంచి సుప్రీంకోర్టు నివేదిక కోరింది. దీనిని ఆయన తీవ్రంగా పరిగణించి వెంటనే కొలీజియం సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా జస్టిస్‌ వర్మను అలహాబాద్‌కు బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈ నెల 14వ తేదీన అగ్నిప్రమాదం జరిగినప్పటికీ… తాజాగా సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం స్పందించి ఆయన్ను మరో హైకోర్టుకు బదిలీ చేయడంతో ఇప్పుడు సంచలనంగా మారింది.

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై సీజేఐ సీరియస్ !

మరోవైపు ఈ విషయంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా(Justice Sanjv Khanna) ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం స్పందించి ఆయన్ను మరో హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. అయితే న్యాయవ్యవస్థ విశ్వసనీయతను కాపాడేందుకు యశ్వంత్ వర్మను బదిలీ చేస్తే సరిపోదని… ఆయన రాజీనామా చేయాలని కొందరు కొలీజియం సభ్యులు పట్టుబట్టినట్లు సమాచారం. అయితే రాజీనామా చేసేందుకు యశ్వంత్ వర్మ నిరాకరించినట్లు సమాచారం. ఓ న్యాయమూర్తి వద్ద ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు దొరకడం న్యాయచరిత్రలో, న్యాయవర్గాల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై అంతర్గత విచారణకు సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

చర్యలు ఎలా ఉంటాయి ?

అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎఎన్ వర్మ కుమారుడు అయిన జస్టిస్ యశ్వంత్ వర్మ… ఢిల్లీ హైకోర్టు కొలీజియంలో సీనియర్ సభ్యులు. 2014లో ఆయన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2021లో ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు వర్మ. కాగా… ఓ న్యాయమూర్తిపై అవినీతి ఆరోపణలు వస్తే ముందు ఆయన నుంచి వివరణ తీసుకోవడం జరుగుతుంది. ఆపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కూడిన అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో న్యాయమూర్తి దోషిగా తేలితే.. ఆయనపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

Also Read : Air India: ఎయిరిండియా విమానంలో ప్రయాణికుడు మృతి

Leave A Reply

Your Email Id will not be published!