Justice Yaswanta Sharma: జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంటులో అభిశంసన తీర్మానం ?
జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంటులో అభిశంసన తీర్మానం ?
Justice Yaswanta Sharma : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున డబ్బునోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పుతుండగా గత మార్చి 14న పెద్ద ఎత్తున నోట్ల కట్టలు ఆయన నివాసంలో బయటపడ్డాయి. దీనితో ఈ డబ్బు నోట్ల కట్టలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈ ఘటన అనంతరం మార్చి 28న ఆయనను అలహాబాద్ హైకోర్టుకు సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేసింది. అయితే నోట్ల కట్టలు దొరికిన జడ్జిని అలాహాబాద్ హైకోర్టుకు పంపించడంపై కూడా వివాదం నెలకొంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సుప్రీంకోర్టు(Supreme Court) కొలీజియం… వర్మను రాజీనామ చేయమని చెప్పినప్పటికీ… ఆయన నిరాకరించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు జడ్జి యశ్వంత్ శర్మపై(Justice Yaswanta Sharma) పార్లమెంటులో అభిశంసన తీర్మానం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని పార్టీలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ఈ తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు చెబుతున్నారు. జస్టిస్ వర్మ స్వచ్ఛందంగా రాజీనామా చేయని పక్షంలో ఈ తీర్మానం సభ ముందుకు వస్తుందని అంటున్నారు. జులై మధ్యలో పార్లమెంటు సమావేశాలు జరగాల్సి ఉన్నాయి.
Justice Yaswanta Sharma – అసలేం జరిగిందంటే ?
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ యశ్వంత్ వర్మ పనిచేస్తుండగా గత మార్చి 14న పెద్దఎత్తున నోట్ల కట్టలు ఆయన నివాసంలో బయటపడటం సంచలనమైంది. ఈ ఘటన అనంతరం మార్చి 28న ఆయనను అలహాబాద్ హైకోర్టుకు సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేసింది. న్యాయపరమైన బాధ్యతలు అప్పగించవద్దని సూచించింది. అనంతరం ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని కమిటీ జస్టిస్ వర్మను తప్పుపట్టింది. ఆయన చర్యలు అనుచితమని, కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఆయన రాజీనామా చేయాలని జస్టిస్ ఖన్నా సూచించగా జస్టిస్ వర్మ నిరాకరించారు. దీనితో జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రికి జస్టిస్ సంజీవ్ ఖన్నా సిఫారసు చేసినట్టు తెలుస్తోంది.
Also Read : Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ పై ప్రధాని తీరును తప్పుపట్టిన రాహుల్ గాంధీ
