Jyotiraditya Scindia : రాహుల్ పై సింధియా ఆగ్రహం
కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్
Jyotiraditya Scindia : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ ద్రోహి భావజాలం కలిగి ఉన్నారని ఆరోపించారు. అంతే కాదు కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందన్నారు. దేశానికి వ్యతిరేకంగా పని చేయడమే ఆ పార్టీ ఒక పనిగా పెట్టుకుందని ఎద్దేవా చేశారు. ఒక విజన్ లేకుండా ముందుకు పోవడం రాహుల్ కు మాత్రమే చెల్లిందంటూ మండిపడ్డారు.
ఆయన ఏం చెప్పదల్చుకున్నారో ముందు దేశానికి చెప్పాలన్నారు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటమే సిద్ధాంతంగా మార్చుకున్న ఘనత రాహుల్ గాంధీకే దక్కుతుందని సీరియస్ కామెంట్స్ చేశారు.
ఆయన రాహుల్ ను, కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు జ్యోతిరాదిత్యా సింధియా(Jyotiraditya Scindia). దేశంలో పటిష్టవంతమైన పాలన కొనసాగిస్తున్న తమను ఢీకొనే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు.
పరువు నష్టం కేసులో దోషిగా రాహుల్ గాంధీని తేల్చిందని, ఇదే సమయంలో న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తీసుకు రావడం దారుణమన్నారు కేంద్ర మంత్రి. వెనుకబడిన వర్గాలను అవమానించారు. ఆపై దేశం కోసం పని చేస్తున్న సాయుధ బలగాల స్థైర్యాన్ని అనుమానించారు. ఇక వీరికి దేశం పట్ల గౌరవం ఉంటుందని ఎలా అనుకోగలమని ప్రశ్నించారు సింధియా.
Also Read : మోదీ చరిత్రను చేర్చండి – కపిల్ సిబల్