K Laxman: ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి – బీజేపీ ఎంపీ లక్ష్మణ్
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - బీజేపీ ఎంపీ లక్ష్మణ్
K Laxman: తెలంగాణాలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకు అప్పగించాలని బీజేపీ ఎంపీ (రాజ్యసభ) లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి… ఆ కేసు దర్యాప్తునకు మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ వద్ద చేపట్టిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ… అధికారాన్ని శాశ్వత పరుచుకునేందుకు నిఘా వ్యవస్థను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేసేందుకు, ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి ఫోన్ ట్యాపింగ్ వాడారన్నారు. టెలికాం రెగ్యులేటరీ చట్టానికి భిన్నంగా, కేంద్రం అనుమతి లేకుండా గత ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు.
K Laxman Comment
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానంతో కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారనే అనుమానం కలుగుతోంది. దోషులకు శిక్ష పడేవరకు బీజేపీ రాజకీయ, న్యాయ పోరాటం చేస్తుది. తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి. బీజేపీ నేత బీఎల్ సంతోష్‌పై బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. మద్యం కేసు నుంచి కవితను తప్పించడం కోసమే బీజేపీ నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గం’’ అని లక్ష్మణ్(K Laxman) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం, ధరణిలో జరిగిన అవినీతిపైనా సీఎం రేవంత్‌రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
Also Read : Bird Flu: నాలుగు రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ ముప్పు ! రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ !