K Viswanath Legend : కళాత‌ప‌స్వికి క‌న్నీటి నివాళి

దివికేగిన సినీ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు

K Viswanath Legend : క‌ళాత‌ప‌స్వి కాశీనాథుని విశ్వ‌నాథ్ ఇక లేర‌న్న వార్త యావ‌త్ సినీ ప్ర‌పంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ , న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. మ‌రో ద‌ర్శ‌కుడు గుణ శేఖ‌ర్ గొప్ప ద‌ర్శ‌కుడిని కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఆయ‌న తీసిన ప్ర‌తి చిత్రం ఓ క‌ళా ఖండం. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన ప్ర‌తి ఒక్క‌రు న‌ట‌నా ప‌రంగా ఉన్న‌త స్థానానికి చేరుకున్నారు.

ప్ర‌తిభ‌కు మెరుగులు దిద్ది అద్భుత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన కె. విశ్వ‌నాథ్(K Viswanath Legend) కు అనేక అవార్డులు గెలుపొందారు. నంది అవార్డుల‌తో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా పొందారు. 2017లో దాదా సాహెబ్ ఫాల్కే పుర‌స్కారం అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయ‌న‌న‌ను ఘ‌నంగా స‌త్క‌రించింది. 1992లో ప‌ద్మ‌శ్రీ అవార్డు ద‌క్కింది.

కె. విశ్వనాథ్ స్వ‌స్థ‌లం ఆంధ్ర ప్ర‌దేశ్ లోని గుంటూరు జిల్లా రేప‌ల్లె. ఆయ‌న వ‌య‌స్సు 92 ఏళ్లు. త‌న జీవితాన్ని సౌండ్ రికార్డిస్ట్ గా ప్రారంభించారు. కొంత కాలం స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌ని చేశారు. 1961లో ఆత్మ గౌర‌వం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఆయ‌న కుల వ్య‌వ‌స్థ‌, వైక‌ల్యం, అంట‌రానిత‌నం, లింగ వివ‌క్ష‌, వ‌ర‌క‌ట్నం, సామాజిక ఆర్థిక స‌వాళ్లు వంటి ఇతివృత్తాల‌తో 50 కి పైగా తెలుగు, హిందీ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

చెల్లెలి కాపురం, కాలం మారింది, శార‌ద‌, ఓ సీత క‌థ‌, జీవ‌న జ్యోతి , సిరి సిరి మువ్వ‌, శంక‌రా భ‌ర‌ణం, స‌ప్త‌ప‌ది, సాగ‌ర సంగ‌మం, స్వాతి ముత్యం, శృతి ల‌య‌లు, స్వ‌ర్ణ క‌మ‌లం, సూత్ర ధారులు, ఆప‌ద్భాంధ‌వుడు, స్వాతి కిర‌ణం చిత్రాలు ఎన్న‌ద‌గిన‌వి. హిందీలో కామ్ చోర్ , శుభ్ కామ్నా, ఈశ్వ‌ర్ , ధ‌న్వాన్ తీశారు.

Also Read : గురువును కోల్పోయాను – క‌మ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!