Kaleshwaram Project Comment : కాళేశ్వరం ఆందోళనకరం
సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ నివేదిక
Kaleshwaram Project Comment : తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ్ల కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన , ప్రచార అస్త్రంగా మారింది. భారీ ఎత్తున ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిని జాతీయ సంపదగా పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. ఇక సీఎం కేసీఆర్ అయితే తన జీవితంలో సంతృప్తికరమైనవి రెండే రెండు ఉన్నాయని చెప్పారు. ఒకటి తెలంగాణ సాకారం రెండు కాళేశ్వరం ప్రాజెక్టును(Kaleshwaram Project) పూర్తి చేయడం. ఇది పక్కన పెడితే ఈ ప్రాజెక్టుపై వచ్చినన్ని ఆరోపణలు, విమర్శలు ఇంకే ప్రాజెక్టుపై రాలేదు. కారణం ప్రజలకు చెందిన ఖజానా మొత్తాన్ని కాళేశ్వరం ఖర్చు చేశారు కేసీఆర్. చివరకు తానే ప్రాజెక్టును డిజైన్ చేశానని ప్రకటించారు.
ప్రపంచ వ్యాప్తంగా మీడియా సంస్థలు దీనిని ఆహా ఓహో అంటూ కీర్తించాయి. చివరకు ఉన్నట్టుండి ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు పూర్తిగా ఒంగి పోయాయి. ఇది బయటకు పొక్కింది. చివరకు సర్కార్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. సీఎం చెప్పింది ఏమైందనే అనుమానం నెలకొంది. దీని గురించి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రశ్నించడం ప్రారంభించాయి. ఏకంగా కాళేశ్వరం ప్రచార అస్త్రంగా మారింది. లక్షా 20 వేల కోట్లకు పైగానే దీని కోసం ఖర్చు చేసినట్లు పేర్కొంది సర్కార్.
Kaleshwaram Project Comment Viral
అంతా బాగానే ఉందని చెబుతూ వచ్చినా ఏ మాత్రం భారీ వర్షాలు, వరదలు వస్తే మాత్రం కాళేశ్వరం కష్టంగానే ఉంటుందని తాజాగా కేంద్ర సర్కార్ పరిధిలోని డ్యాం సేఫ్టీ అధికారులు విడుదల చేసిన నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ ఇది మరింత అగ్గిని రాజేలా చేసిందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మేడిగడ్డ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఇక ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ సైతం సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) పూర్తిగా అవినీతితో కూరుకు పోయిందని, ఇది కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎం లాగా మారిందని సంచలన ఆరోపణలు చేశారు. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఏకంగా కాళేశ్వరం ఏటీఎంను ఏర్పాటు చేసింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో వైరల్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోందని, మేడిగడ్డ బ్యారేజ్ కు నీళ్లు నింప వద్దంటూ స్పష్టం చేసింది డ్యామ్ సేఫ్టీ నివేదిక.
పునాది కింద ఇసుక పూర్తిగా కొట్టుకు పోయిందని, దీని కారణంగానే పిల్లర్లు బలహీన పడ్డాయని హెచ్చరించింది. ఇందుకు వాటిన మెటీరియల్ పూర్తిగా నాణ్యత లోపించిందని పేర్కొంది. విచిత్రం ఏమిటంటే బ్యారేజ్ ప్రణాళిక , డిజైన్ కు పూర్తిగా తేడా ఉందంటూ స్పష్టం చేసింది. ప్లానింగ్ కు తగినట్టుగా దీని నిర్మాణం జరగలేదంటూ ఆరోపించింది. 2019లో ప్రారంభించిన ఈ బ్యారేజ్ ఆనాటి నుంచి ఇప్పటి వరకు సరిగా పర్యవేక్షణ జరగలేదని కుండ బద్దలు కొట్టింది. అంతే కాకుండా బ్లాక్ 7 ను పునాది నుంచి తొలగించాలని స్పష్టం చేసింది.
ఇతర బ్లాక్ లు కూడా ఇదే రీతిలో కుంగే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది నివేదిక. మరో సంచలన కామెంట్ చేసింది .. మేడిగడ్డ తరహా లోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపింది. మొత్తంగా కోట్ల రూపాయలు నీళ్ల పాలు చేశారనేది అర్థమై పోయింది. డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన నివేదిక ఇప్పుడు కలకలం రేపుతోంది. దీనికి సీఎం కేసీఆర్ ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి.
Also Read : Kalipatnam Ramarao: కారా మాస్టారు