Kangana Ranaut : కరణ్ జోహార్ పై కంగనా కన్నెర్ర
రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ మూవీ
Kangana Ranaut : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నిప్పులు చెరిగారు. బాలీవుడ్ దర్శకుడు , రచయిత కరణ్ జోహార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ బడ్జెట్ తో ఆయన రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ పేరుతో చిత్రం తీశారు. దీని కోసం ఏకంగా రూ. 250 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు బయట టాక్. ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్ ,ఆలియా భట్ కలిసి నటించారు.
Kangana Ranaut Serious
ఈ మూవీ జూలై 28న విడుదలైంది. దీనిపై సీరియస్ కామెంట్స్ చేశారు కంగనా రనౌత్(Kangana Ranaut). ఇదీ ఒక సినిమానేనా అంటూ మండిపడ్డారు. రచయితగా ట్రై చేయి బాగుంటుందని , ఇలాంటి చెత్త సినిమాలు తీస్తే జనం చూడరంటూ హితవు పలికారు కంగనా రనౌత్.
ఇందులో ఏం ఉందని సినిమాను చూడాలని ప్రశ్నించింది. ఎవరి కోసం తీస్తున్నామో తెలియకుండా చిత్రాలను నిర్మిస్తే, దర్శకత్వం వహిస్తే ఇలాగే అవుతుందంటూ మండిపడింది బాలీవుడ్ నటి. ఇక నుంచి నువ్వు దర్శకుడిగా పనికి రావంటూ కుండ బద్దలు కొట్టింది ఈ అమ్మడు. పనిలో పనిగా రణ్ వీర్ సింగ్ కు కూడా చురకలు అంటించింది.
కరణ్ జోహార్ చెప్పినట్లు చేస్తే ఉన్న మతి పోతుందని , కెరీర్ పాడవుతుందని హెచ్చరించింది. దక్షిణాది నటులను చూసి నేర్చుకోవాలని సూచించింది. వాళ్ల డ్రెస్ సెన్స్ చాలా హుందాగా ఉంటుందని కితాబు ఇచ్చింది. మొత్తంగా కంగనా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : Vijaya Sai Reddy : బాబుది స్క్రిప్ట్ వదినది డైలాగ్