Kapil Dev Rohit Sharma : రోహిత్ ఫిట్ నెస్ పై క‌పిల్ కామెంట్స్

అధిక బ‌రువుగా ఉంటే ఎలా ఆడ‌తాడు

Kapil Dev Urges Rohit Sharma : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ నిఖంజ్(Kapil Dev Urges) షాకింగ్ కామెంట్స్ చేశాడు. భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆట‌గాళ్ల‌కు ఫిట్ నెస్ ముఖ్యం. 

కెప్టెన్ ఇత‌ర ఆట‌గాళ్ల‌కు ఆద‌ర్శంగా ఉండాలి. కానీ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) మ‌రీ అధిక బ‌రువుగా క‌నిపిస్తున్నాడ‌ని పేర్కొన్నారు క‌పిల్ దేవ్. విచిత్రం ఏమిటంటే బీసీసీఐ ఏం చేస్తోందంటూ నిల‌దీశాడు. ఇప్ప‌టికే మాజీ సెలెక్ట‌ర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు.

క్రికెట‌ర్లు ఫిట్ నెస్ కోసం స్టెరాయిడ్స్ కాకుండా ఇత‌ర ఇంజెక్ష‌న్లు వాడుతారంటూ పేర్కొన్నాడు. ఇదే స‌మ‌యంలో త‌న కెప్టెన్సీలో ఆడిన చేత‌న్ శ‌ర్మ వ్యాఖ్య‌లకు మ‌రింత బ‌లం చేకూర్చేలా క‌పిల్ దేవ్ గురువారం కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. అయితే ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా భార‌త్ లో ప‌ర్య‌టిస్తోంది. ఇప్ప‌టికే రెండు టెస్టుల్లో భార‌త్ ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

అయితే ప‌దే ప‌దే కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, కేఎల్ రాహుల్ విశ్రాంతి పేరుతో కొన్ని మ్యాచ్ ల‌కు దూరంగా ఉంటున్నారు. ఈ త‌రుణంలో రోహిత్ శ‌ర్మ పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నాడా అనే అనుమానాన్ని వ్య‌క్తం చేశాడు క‌పిల్ దేవ్. అలా ఉంటే బ్యాట్ పై ఎలా నియంత్ర‌ణ క‌లిగి ఉంటాడ‌ని ప్ర‌శ్నించాడు. ఇది పూర్తిగా ప‌క్క‌దారి ప‌ట్టించ‌డ‌మే అవుతుంద‌ని అన్నాడు క‌పిల్ దేవ్. ఇదిలా ఉండ‌గా ప‌లువురు ఆట‌గాళ్లు ఆడ‌క పోయినా ఎంపిక చేయ‌క పోవ‌డం ప‌లు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

Also Read : సన్ రైజ‌ర్స్ స్కిప్ప‌ర్ గా మార్క్‌రమ్‌

Leave A Reply

Your Email Id will not be published!