Kapil Dev Samson : నిల‌క‌డ‌గా ఆడితే సంజూ శాంస‌న్ సూప‌ర్

భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్

Kapil Dev – Samson : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ నిఖంజ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు కు కెప్టెన్ గా

ఉన్న కేర‌ళ స్టార్ హిట్ట‌ర్ సంజూ శాంస‌న్(Kapil Dev – Samson) పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

భార‌త జ‌ట్టులో ఎప్ప‌టికీ ఉండాల్సిన ఆట‌గాడు శాంసన్. కానీ ఆట‌లో నిల‌క‌డ‌గా ఆడ‌లేక పోవ‌డం వ‌ల్ల స్థానం కోల్పోతున్నాడు. మొద‌టి రెండు మూడు మ్యాచ్ లు దుమ్ము రేపుతాడు.

ఆ త‌ర్వాత ఇక ఆడేందుకు ఇబ్బంది ప‌డ‌తాడు. ఇది కాదు కావాల్సింది. స్థిర‌త్వంతో ఆడితే సంజూ శాంస‌న్ కు తిరుగంటూ ఉండ‌ద‌ని పేర్కొన్నాడు

క‌పిల్ దేవ్(Kapil Dev – Samson).

భార‌త దేశంలో ఇటీవ‌ల జ‌రిగిన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ 2022లో సంజూ శాంస‌న్ నాయ‌క‌త్వంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను 14 ఏళ్ల త‌ర్వాత ఫైన‌ల్ కు చేర్చాడు.

కెప్టెన్సీ ప‌రంగా సంజూకు 100 మార్కులు ప‌డ్డాయి. కానీ ఆట ప‌రంగా కొంత విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. మొత్తం టోర్నీలో 485 ప‌రుగులు చేశాడు. గ‌తంలో కంటే త‌క్కువ‌. కానీ స్ట్రేక్ రేట్ మాత్రం ఎక్కువ‌గానే ఉంది.

ఇప్ప‌టి వ‌ర‌కు వికెట్ కీప‌ర్లుగా రిష‌బ్ పంత్ , సంజూ శాంస‌న్ , దినేశ్ కార్తీక్ , ఇషాన్ కిష‌న్ లు ఉన్నార‌ని కానీ వ‌చ్చే వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఎవ‌రైతే స్థిరంగా రాణిస్తారో వారికి చాన్స్ ఉంటుంద‌న్నాడు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సంజూ శాంస‌న్ కు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉన్నాయ‌ని, కానీ స్థిరంగా రాణించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు క‌పిల్ దేవ్.

బ్యాటింగ్, స్టంపింగ్ చేయ‌డంలో నైపుణ్యం ఉంది.

ఒకానొక స‌మ‌యంలో ఒంటి చేత్తో గెలిపించే స‌త్తా కూడా శాంస‌న్ కు ఉంద‌న్నాడు. టాలెంట్ కు కొద‌వ లేదు. కానీ స్థిర‌త్వ‌మే త‌క్కువ‌గా ఉంద‌ని

దానిని అధిగ‌మించ గ‌లిగ‌తే అత‌డిని మించిన ప్లేయ‌ర్ అంటూ ఉండ‌డ‌ని కితాబు ఇచ్చాడు క‌పిల్ దేవ్.

Also Read : బెయిర్ స్టో షాన్ దార్ ఇంగ్లాండ్ జోర్దార్

Leave A Reply

Your Email Id will not be published!