Kapil Dev & Kohli : విరాట్ కోహ్లీపై కపిల్ దేవ్ సెటైర్
రెస్ట్ కంటే రంజీలో ఆడటం బెటర్
Kapil Dev & Kohli : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్(Kapil Dev) మరోసారి సంచలన కామెంట్స్ చేశాడు విరాట్ కోహ్లీపై. ఆయన మొదటి నుంచీ కోహ్లీ పూర్ పర్ ఫార్మెన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.
గత నాలుగు సంవత్సరాలలో కోహ్లీ ఖాతాలో ఒక్క సెంచరీ లేదు. అన్ని ఫార్మాట్ లలో అద్భుతమైన ప్లేయర్ గా ఇప్పటికే పేరు తెచ్చుకున్న కోహ్లీ ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతున్నాడు.
ఎవరైనా ఫామ్ కోల్పోయినప్పుడు వెంటనే మ్యాచ్ లు ఆడాలని అనుకుంటారు. కానీ రెస్ట్ తీసుకోవడం ఏమిటోనని పేర్కొన్నాడు. సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదన్నాడు కపిల్ దేవ్(Kapil Dev).
ఇదిలా ఉండగా ఇంగ్లండ్ టూర్ లో భాగంగా భారత జట్టు రీ షెడ్యూల్ మ్యాచ్ ఆడింది. ఇందులో 7 వికెట్ల తేడాతో ఓడి పోయింది. అయితే కపిల్ దేవ్ దీనిపై స్పందించాడు.
స్పిన్నర్ అశ్విన్ కు చాన్స్ ఇవ్వక పోవడాన్ని తప్పుపట్టాడు. ఫామ్ లో లేని కోహ్లీని ఎందుకు ఎంపిక చేశారంటూ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
క్రికెటర్ సరిగా ఆడక పోతే రెస్ట్ అయినా ఇస్తారు సెలెక్టర్లు లేదంటే జట్టు నుంచి తప్పించడం చేస్తారని పేర్కొన్నాడు కపిల్ దేవ్. ఫామ్ లోకి రావాలంటే రంజీ లేదా ఇతర ఫార్మాట్ లలో కోహ్లీ(Virat Kohli) ఆడాలని సూచించాడు.
ఇదిలా ఉండగా కపిల్ ఇంతకూ కోహ్లీని పొగిడాడా లేక ఎద్దేవా చేశాడా అన్నది తెలియక ఫ్యాన్స్ తెగ వాపోతున్నారు.
Also Read : బీసీసీఐ బాస్ ల పదవీ కాలంపై ఉత్కంఠ