Bommai Emotional : ‘777 చార్లీ’ మూవీ చూసి బొమ్మై కంటతడి
ప్రతి ఒక్కరు చూడాలని సీఎం పిలుపు
Bommai Emotional : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Bommai Emotional) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఒక రకంగా ఆయన చిన్న పిల్లాడిలా ఏడ్చేశారు. ఆయనను కంట తడి పెట్టించింది మాత్రం కన్నడలో తీసిన సినిమా. అదే 777 చార్లీ చిత్రం.
ఈ సినిమాలో యజమాని, పెంపుడు కుక్క (శునకం) చార్లీ మధ్య ఉన్న బంధాన్ని వర్ణిస్తుంది. విడుదలైనప్పటి నుంచి వేల సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది.
ఈ చిత్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయన ప్రత్యేకంగా ఈ సినిమాను థియేటర్ లో కూర్చుని సినిమా చూశారు. బసవరాజ్ బొమ్మై(Bommai Emotional) తన కన్నీళ్లను తుడుచుకుంటూ కనిపించారు.
ప్రస్తుతం ఆయన కంట తడి పెట్టడం కలకలం రేపింది. ఈ సందర్భంగా సీఎం సినిమా నిర్మాతలను, దర్శకులు, సినిమాలో నటించిన వారికి, ఇందులో పని చేసిని సినిమా యూనిట్ ను ప్రత్యేకంగా ప్రశంసలతో ముంచెత్తాడు.
మనిషి, శునకం మధ్య ఉన్న బంధాన్ని ఇంత గొప్పగా చిత్రీకరించిన సినిమాను తాను ఇంత వరకు చూడలేదన్నాడు సీఎం. ఏ మాత్రం వీలు చిక్కినా ఈ మూవీని చూడాలని పిలుపునిచ్చారు బొమ్మై.
ఇదిలా ఉండగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టే కొద్ది వారాల ముందు గత ఏడాది తాను ప్రాణపదంగా పెంచుకున్న తన శునకం స్నూబీని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
777 చార్లీ తనను మళ్లీ గత జ్ఞాపకాల్లోకి తీసుకు వెళ్లిందన్నారు సీఎం. ఈనెల 10న కన్నడలో తీసిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ ఆదరణ చూరగొంటోంది.
ఈ సందర్భంగా సీఎం బొమ్మై మీడియాతో మాట్లాడారు. శునకాల మీద చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ చిత్రంలో జంతువుల ఎమోషన్స్ ను అద్భుతంగా ఈ చార్లీ ద్వారా చూపించారని చెప్పారు.
నేను షరతులు లేని ప్రేమ గురించి మాట్లాడుతున్నానని అన్నారు.
Also Read : జానీ డెప్ అద్భుతమైన నటుడు – అంబర్