Minister N Nagaraju : బీజేపీ మంత్రి ఆస్తులు రూ.1,609 కోట్లు
ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడి
Minister N Nagaraju : కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి వచ్చే మే నెల 10న. 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల బరిలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, పోటీ చేయాలని అనుకుంటన్న వారంతా ఎన్నికల అఫిడవిట్ లో తమ ఆస్తులు నమోదు చేయాల్సి ఉంటుంది.
తాజాగా భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రి ఎన్ . నాగరాజు(Minister N Nagaraju) కీలక ప్రకటన చేశారు. తనకు రూ. 1,609 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ వివరాలను తన అఫిడవిట్ లో స్పష్టంగా తెలియ చేసినట్లు వెల్లడించారు.
కేబినెట్ లో ఉన్న నాగరాజు చదివింది కేవలం 9వ తరగతి మాత్రమే. ఆయనకు 72 ఏళ్లు. వ్యవసాయం, వ్యాపారం, ఇతర వనరులు, భార్యకు సంబంధించిన ఆస్తితో కలుపుకుని వివరాలు వెల్లడించారు. హోస్కోట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అధికార బీజేపీ అభ్యర్థిగా ఎన్ . నాగరాజు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
దేశంలోని అత్యంత ధనిక రాజకీయ నాయకులలో ఒకరిగా పరిగణించ బడుతున్నారు ఎన్. నాగరాజు. అతని భార్య ఎం. శాంతకుమారి కలిసి రూ. 536 కోట్ల విలువైన చరాస్తులను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ఈ దంపతుల స్థిరాస్తుల విలువ రూ. 1,073 కోట్లు.
ప్రస్తుతం ఎన్. నాగరాజు ఎమ్మెల్సీగా ఉన్నారు. జూన్ , 2020లో శాసన మండలి ఎన్నికల బరిలో ఉన్న సమయంలో తన భార్యతో కలిసి రూ. 1,220 కోట్ల ఆస్తులను ప్రకటించారు. నామినేషన్ తో పాటు ఇవాళ దాఖలు చేసిన అఫిడవిట్ లో ఈ జంట మొత్తం రూ. 98.36 కోట్ల రుణాలు ఉన్నట్లు తెలిపారు.
Also Read : కనకపుర నుంచి బరిలో డీకే