Roopa Sindhuri Transferred : రూప..సింధూరిపై బదిలీ వేటు
పోస్టింగ్ ఇవ్వని కర్ణాటక సర్కార్
Roopa Sindhuri Transferred : వ్యక్తిగత విమర్శలకు దిగుతూ తమ పదవులకు భంగం కలిగించేలా వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు కోలుకోలేని షాక్ ఇచ్చింది కర్ణాటక ప్రభుత్వం. ఈ మేరకు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న రాష్ట్ర హస్త కళల కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న సీనియర్ ఉన్నతాధికారి డి రూప మౌద్గిల్ తో పాటు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఆ ఇద్దరి ఉన్నతాధికారులను బదిలీ(Roopa Sindhuri Transferred) చేసింది. అయితే ఈ ఇద్దరికీ పోస్టింగ్ ఎక్కడా ఇవ్వలేదు. సింధూరి 2021, 2022 లో ముగ్గురు అధికారులతో తన ఫోటోలను పంచుకున్నారని డి రూప ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. తన వ్యక్తిగత ఫోటోలను ఎలా పోస్ట్ చేస్తారంటూ నిలదీసింది డి. రూపాను. ఆమెపై నిప్పులు చెరిగింది. ఇదిలా ఉండగా 19 అభియోగాలు మోపారు రూపా మౌద్గిల్.
ఈ ఇద్దరి వ్యవహారం కర్ణాటక ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. చివరకు ఈ ఇద్దరు అధికారులు సిగపట్లు పట్టుకునే స్థాయికి దిగజారారు. దీంతో జనం వీరి నిర్వాకాన్ని చూసి నివ్వెర పోయారు. ఈ మధ్యాహ్నం సర్కార్ కీలక ప్రకటన చేసింది.
ఇదే సమయంలో డి రూప మౌద్గిల్ భర్త మునీష్ మౌద్గిల్ ప్రచార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. నిన్న రాష్ట్ర హోం శాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర సీరియస్ గా స్పందించారు. చర్యలు తప్పవని హెచ్చరించారు. అంత లోపే ఇద్దరిని బదిలీ చేయడం, ఆపై ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచడం కలకలం రేపింది.
Also Read : ‘సీనియర్ల’ సిగపట్లు జనం చీవాట్లు