Kashmiri Killings Comment : ఎన్నాళ్లీ ర‌క్త‌పాతం ఎందుకీ ఘోరం

జ‌మ్మూ కాశ్మీర్ లోయ‌లో కాల్పుల మోత‌

Kashmiri Killings Comment : 1947 నాటి నుంచి నేటి 2022 దాకా భార‌త‌, పాకిస్తాన్ దాయాది దేశాల మ‌ధ్య అంత‌రం పెరిగి పోయింది. ఎంత‌లా అంటే దాడులు చేసుకునేంత దాకా. భార‌త దేశం త‌న పంథాను మార్చుకోవ‌డం లేదు.

ఎందుకంటే దాని సిద్దాంతం ఒక్క‌టే శాంతి మంత్రం. కానీ పాకిస్తాన్ త‌న నైజాన్ని వీడ‌డం లేదు. దాని ఉద్దేశం ఒక్క‌టే ఉగ్ర‌వాదం. అది ప్ర‌పంచాన్ని ద‌హించి వేస్తోంది.

చివ‌ర‌కు ఆ దేశాన్ని కూడా స‌ర్వ నాశ‌నం చేసే స్థాయికి చేరుకుంది. ఇదంతా ప‌క్క‌న పెడితే వేచి చూసే ధోర‌ణి, సానుకూల దృక్ప‌థం ఎక్క‌డా ప‌ని చేయ‌డం లేదు.

ఉగ్ర‌వాదులు భార‌త్ ను టార్గెట్ చేశారు. ప‌లుసార్లు దాడుల‌కు తెగ‌బడ్డారు. ప్ర‌ధానంగా జ‌మ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టిక‌ల్ ర‌ద్దు త‌ర్వాత కాల్పుల మోత కొన‌సాగుతూనే ఉన్న‌ది.

దానికి ముగింపు ఇప్ప‌ట్లో ల‌భించేట‌ట్టు లేదు. ప్ర‌ధానంగా కాశ్మీర్ పండిట్ల‌ను టార్గెట్ చేయడం ఒకింత క‌ల‌క‌లానికి క‌ల్లోలానికి దారి తీసింది.

భార‌త్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ లోని మిలిటెంట్లు ఈ ప్రాంతంలో మైనార్టీలుగా ఉన్న హిందువుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు పాల్ప‌డుతున్నారు.

ప్ర‌తి రోజూ ఎక్క‌డో ఒక చోట టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడికి పాల్ప‌డ్డారు. బీహార్ వ‌ల‌స కూలీల‌ను పొట్ట‌న పెట్టుకున్నారు.

కాశ్మీరీ పండిట్ల‌ను కాల్చి చంపారు. భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు త‌మదైన రీతిలో జ‌వాబు ఇస్తున్నారు. కానీ ఎక్క‌డో ఒక చోట టార్గెట్ చేస్తూ చంపుతూ పోతున్నారు క‌ర‌డు గ‌ట్టిన టెర్ర‌రిస్టులు.

కాశ్మీర్ లోయ‌లో (Kashmiri Killings) ప్ర‌ధానంగా హిందూ బ్రాహ్మ‌ణులు, హిందూ సంఘాలు, సిక్కులు, బౌద్దులు ఉన్నారు. 1990వ ప్రాంతంలో ఈ ప్రాంతం

నుంచి త‌ట్టుకోలేక భ‌యంతో వేలాది మంది పండిట్లు పారి పోయారు కాశ్మీర్ నుండి.

కొంత మంది మాత్ర‌మే మిగిలారు. వారిని కూడా వ‌ద‌ల‌డం లేదు. భ‌య‌భ్రాంతుల‌కు లోను చేస్తున్నారు. గ‌త మూడు నెల‌ల్లో విప‌రీతంగా టార్గెట్ చేశారు.

ఫార్మాసిస్ట్ , డ్రైవ‌ర్ , టీచ‌ర్ , బ్యాంకు ఉద్యోగి ఇలా చెప్పుకుంటూ పోతే కాల్పుల‌కు గురైన వారి సంఖ్య‌ను చెప్ప‌డం క‌ష్టం.

ఉగ్ర‌వాదుల దెబ్బ‌కు 40 వేల‌కు పైగా పండిట్ కుటుంబాలు దేశంలోని వివిధ ప్రాంతాల‌లో స్థిర‌ప‌డ్డాయి. బీజేపీ ప్ర‌భుత్వం కొలువు తీరాక పండిట్ల పునరావాసం కోసం చ‌ర్య‌లు చేప‌ట్టింది.

కానీ అది కూడా విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. ఒక ర‌కంగా భార‌త దేశం కోసం పాటు ప‌డే , నిన‌దించే వారినే ఉగ్ర‌వాదులు ల‌క్ష్యంగా చేసుకోవ‌డం బాధాక‌రం.

ఇక‌నైనా కేంద్ర ప్ర‌భుత్వం వెంట‌నే రంగంలోకి దిగాలి. బ‌ల‌గాల‌ను మ‌రింత పెంచాలి. అక్క‌డ నివ‌సిస్తున్న వారికి భ‌రోసా, భ‌ద్ర‌త క‌ల్పించాలి. లేక పోతే కాశ్మీర్ లోయ ఒక జ్ఞాప‌కంగా మాత్ర‌మే మిగ‌ల‌నుంది.

Also Read : ఇత‌రుల జోక్యాన్ని స‌హించం – చైనా

Leave A Reply

Your Email Id will not be published!