Katragadda Prasad : చంద్ర‌బాబు ఏ త‌ప్పు చేయ‌లేదు

నిర్మాత కాట్ర‌గ‌డ్డ ప్ర‌సాద్ కామెంట్

Katragadda Prasad : హైద‌రాబాద్ – ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై రిమాండ్ ఖైదీగా 53 రోజుల పాటు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో ఉన్నారు. త‌న ఆరోగ్యం బాగో లేదని, కంటికి ఆప‌రేష‌న్ చేయించు కోవాల్సి ఉంద‌ని , ద‌య‌తో త‌న‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేయాల‌ని కోరుతూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

Katragadda Prasad Comment on Chandrababu

దీనిపై విచారించిన కోర్టు నాలుగు వారాల పాటు వెసులుబాటు ఇచ్చింది చంద్ర‌బాబు నాయుడుకు(Chandrababu). ప‌లు కండీష‌న్స్ కూడా విధించింది కోర్టు. రాజ‌కీయ వ్య‌వ‌హారాల గురించి మాట్లాడ కూడ‌దంటూ స్ప‌ష్టం చేసింది. ఆయ‌న అక్టోబ‌ర్ 31న బ‌య‌ట‌కు వ‌చ్చారు.

చంద్ర‌బాబుకు జ‌నం బ్ర‌హ్మ‌రథం ప‌ట్టారు. ఇక తెలుగు సినిమా రంగానికి చెందిన సినీ ప్ర‌ముఖులు కొంద‌రు బాబు జ‌పం చేస్తున్నారు. ఆ కోవ‌లో ప్ర‌ముఖ నిర్మాత కాట్ర‌గ‌డ్డ ప్ర‌సాద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న‌ను మ‌హానుభావుడు అంటూ కితాబు ఇచ్చారు.

ఆనాడు ఎన్టీఆర్ కోసం జ‌నం ఎలా ఎదురు చూశారో నిన్న చంద్రబాబు నాయుడు బ‌య‌ట‌కు ఎప్పుడు వ‌స్తాడా అని క‌ళ్ల‌ల్లో వ‌త్తులు వేసుకుని వేచి ఉన్నారంటూ పేర్కొన్నారు. ఆయ‌న స్వ‌యంగా వీడియో రిలీజ్ చేశారు.

చంద్ర‌బాబు నాయుడు ఎలాంటి తప్పు చేయ‌లేద‌ని పేర్కొన్నారు. ఆయ‌న నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌స్తాడ‌ని ఆశా భావం వ్య‌క్తం చేశారు.

Also Read : CM KCR : అధికారం కోసం కేసీఆర్ యాగం

Leave A Reply

Your Email Id will not be published!