Kavya Maran Harry Brook : కావ్య మారన్ మెచ్చిన చిన్నోడు
హాట్ టాపిక్ గా మారిన హ్యారీ బ్రూక్
Kavya Maran Harry Brook : సన్ రైజర్స్ హైదరాబాద్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావ్య మారన్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. కేరళలోని కొచ్చిలో జరిగిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) 2023లో వేలం పాటలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. కెమెరా కళ్లన్నీ ఆమె పైనే ఫోకస్ పెట్టాయి. అందరి కళ్లు కావ్య మారన్ పై ఉంటే ఆమె కళ్లు మాత్రం ఒకే ఒక్కడిపై నిలిచాయి.
అతడు ఎవరో కాదు మిల్కీ బాయ్ గా పేరొందిన హ్యారీ బ్రూక్. ఐపీఎల్ వేలం పాటలో టాప్ ధరకు సామ్ కరన్ అమ్ముడు పోతే. రెండో స్థానంలో కామెరూన్ ను ముంబై ఇండియన్స్ తీసుకుంది. 10 ఫ్రాంచైజీలు పాల్గొన్న ఈ వేలం పాటలో అత్యధికంగా డబ్బులు ఉన్నది మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ తోనే.
దీంతో సిఇఓ కావ్య మారన్ భారీగా ధర పెట్టి కొనుగోలు చేస్తుందని ఆశించారు. కానీ ఆమె ఎవరూ ఊహించని రీతిలో బేస్ ధర కే వేలం పాటలోకి వచ్చిన హ్యారీ బ్రూక్ ను ఏకంగా రూ. 13. 25 కోట్లకు కొనుగోలు చేశారు(Kavya Maran Harry Brook). ఇది అందరినీ విస్తు పోయేలా చేసింది. ప్రస్తుతం ఈ వేలం పాటలో తనకు భారీ ధర రావడంతో సంతోషానికి గురవుతున్నాడు బ్రూక్.
ఊహించని ధరకు తీసుకోవడంతో అటు సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులతో పాటు మిగతా ఫ్రాంచైజీలు సైతం ఆశ్చర్యానికి గురయ్యాయి. ఇక హ్యారీ బ్రూక్ తర్వాత రూ. 8.25 కోట్లకు మయాంక్ అగర్వాల్ ను తీసుకుంది కావ్య మారన్. మొత్తంగా ఇంత భారీ మొత్తం పెట్టి ఎందుకు బ్రూక్ ను తీసుకుందనే దానిపై ఇప్పటికీ మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలి పోయింది. ఏది ఏమైనా కావ్య మారనా మజాకా అంటున్నారు ఆటగాళ్లు.
Also Read : నెట్టింట్లో కావ్య మారన్ వైరల్