Kerala High Court : నగ్నత్వాన్ని సెక్స్ తో ముడిపెట్టొద్దు
కేరళ హైకోర్టు సంచలన తీర్పు
Kerala High Court : నగ్నత్వం వేరు శృంగారం వేరు. ఒక దానితో మరొకటి ముడి పెట్టడం మంచి పద్దతి కాదని సంచలన తీర్పు వెలువరించింది కేరళ హైకోర్టు(Kerala High Court). మహిళపై దాఖలైన కేసును రద్దు చేసింది. ఇదిలా ఉండగా మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమా పోక్సో జువైనల్ జెస్టిస్ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టలోని పలు నిబంధనల కింద అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
రెహానా ఫాతిమా తన శరీరాన్ని తన పిల్లలు చిత్రీకరించు కునేందుకు కాన్వాస్ గా ఉపయోగించు కోవడానికి మాత్రమే అనుమతించిందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకరి శరీరంపై స్వయం ప్రతిపత్తి హక్కు తరచుగా న్యాయమైన లింగానికి నిరాకరించ బడుతోందని పేర్కొంది. అంతే కాదు వారి శరీరాలు , జీవితాల గురించి ఎంపిక చేసుకునేందుకు బెదిరింపులకు, వివక్షకు, వేధింపులకు గురవుతున్నారని స్పష్టం చేసింది. ఈ కేసు నుంచి రెహానా ఫాతిమాను విడుదల చేస్తున్నట్లు తీర్పు చెప్పింది.
ఫాతిమా తన మైనర్ పిల్లలకు సెమీ న్యూడ్ ఫోజులిచ్చి పెయింటింగ్ వేసేందుకు అనుమతించిన వీడియోను ప్రసారం చేసినందుకు ఫోక్సో , జువెనైల్ జస్టిస్ , ఐటీ చట్టాలలోని వివిధ రూల్స్ కింద అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
కేసు నుండి ఆమెను విడుదల చేస్తూ జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 33 ఏళ్ల మహిళా కార్యకర్తపై వచ్చిన ఆరోపణలు బట్టి ఆమె పిల్లలను ఏదైనా నిజమైన లేదా అనుకరణ లైంగిక చర్యలకు ఉపయోగించారని , అది కూడా లైంగిక సంతృప్తి కోసం ఉపయోగించారని ఎవరూ ఊహించ లేరని పేర్కొన్నారు.
Also Read : David Warner Comment : క్రికెట్ పై వార్నర్ చెరగని ముద్ర